అబ్రకదబ్ర: మాయమయ్యే మెర్సిడెస్ బెంజ్ వెనుక రహస్యం..?

జేమ్స్ బాండ్ 007 సినిమాలో మాయమైపోయే కారు మీకు గుర్తుండే ఉంటుంది. అది సినిమా కాబట్టిలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ఇది సాధ్యమైంది. కానీ నిజ జీవితంలో కూడా ఇది సాధ్యమవుతుందా అంటే, సాధ్యమవుతుందనే అంటోంది మెర్సిడెస్ బెంజ్. మెర్సిడెస్ బెంజ్ తయారు చేసిన సరికొత్త ఫ్యూయెల్ సెల్ (ఎఫ్-సెల్) హైడ్రోజెన్ టెక్నాలజీను ప్రమోట్ చేసేందుకు కంపెనీ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

కంపెనీ ఓ మెర్సిడెస్ బెంజ్ కారును ఒకవైపు పూర్తిగా ఎల్ఈడి షీట్లతో కప్పివేసి మరోవైపు కెనాన్ ఈఓఎస్ 5డి మార్క్ 2 డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాను ఉపయోగించింది. కారుకు మరోవైపు అమర్చిన ఈ కెమెరా అవతలివైపు ఉన్న చిత్రాలను స్పష్టంగా ఇవతలివైపు ఉన్న ఎల్ఈడి షీట్లపై ప్రతిభింభింపజేస్తుంది. ఫలితంగా ఈ కారును ఎల్ఈడి షీట్లు అమర్చిన వైపు నుండి చూసినప్పుడు, కారుకు అవతలివైపు ఉన్న ప్రదేశం, వస్తువులు, వ్యక్తులు యధాతథంగా కనిపిస్తారు.

మెర్సిడెస్ బెంజ్ అభివృద్ధి చేసిన ఎఫ్-సెల్ హెడ్రోజన్ టెక్నాలజీతో పనిచేసే కార్లు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తాయి. ప్రారంభ దశలో భాగంగా వీటిని కొద్ది సంఖ్యలో మాత్రమే తయారు చేస్తుంది. మరో మూడేళ్లలో వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 30 మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎఫ్-సెల్ కార్లను కాలిఫోర్నియాలో ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 7, 2012, 17:22 [IST]
English summary
Mercedes-Benz has created a new television commercial to promote their F-CELL hydrogen technology powered cars. Designed to advertise the car’s ability to produce zero emissions and protect the environment, Mercedes-Benz covered the automobile in several mats of LEDs on the driver side of the car and mounted a Canon EOS 5D Mark II digital SLR camera on the opposite side of the vehicle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+