కస్టమర్ల కోసం సమ్మర్ క్యాంప్‌‌ను ప్రకటించిన మిత్సుబిషి

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ కంపెనీ మిత్సుబిషి మోటార్స్ ఇండియా తమ కస్టమర్ల కోసం సమ్మర్ స్పెషల్ క్యాంప్‌ను నిర్వహించనుంది. ఈ సమ్మర్ క్యాంప్ రేపటి నుండి మూడు రోజుల (మే 17, 2012 నుండి మే 19, 2012 వరకూ) జరగనుంది.

ఈ సమ్మర్ క్యాంప్‌కు విచ్చేసే కస్టమర్ల వాహనాలను ఉచితంగా తనిఖీ చేసి ఏవైనా లోపాలుంటే సరిచేస్తామని కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు మెరుగైన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని మిత్సుబిషి తెలిపింది.

ఈ సమ్మర్ క్యాంప్ వచ్చే వాహనాల్లో ఏసి, వెహికల్ కండిషన్, వెహికల్ ఫ్లూయిడ్స్ టాపింగ్ అప్, బ్యాటరీ చెక్, వాషింగ్ వంటి సేవలను అందిచనున్నారు. అలాగే రిపేర్లు, లేబర్ ఛార్జీలు, విడి భాగాలపై తగ్గింపులను కూడా మిత్సుబిషి అందిస్తుంది. మిత్సుబిష్ వాహనాల యజమానులు తమ సమీపంలో మిత్సుబిషి డీలర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలను పొందవచ్చు. మిత్సుబిషితో పాటుగా ఇప్పటికే పలు ఇతర కార్ కంపెనీలు కూడా తమ కస్టమర్ల కోసం సమ్మర్ క్యాంప్‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, May 16, 2012, 18:44 [IST]
English summary
Japanese carmaker Mitsubishi Motors India has announced a three days (starting, May 17, 2012) summer camp for its customers. The company will offer free services like AC check, overall vehicle condition check, battery check and washing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+