కొత్త మహీంద్రా పాంటెరో (స్టాలియో) రహస్య చిత్రాలు
మీకు మహీంద్రా స్టాలియో గుర్తుందా..? దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూ వీలర్స్ లిమిటెడ్' (ఎమ్‌టిడబ్ల్యూఎల్) నిలిపివేసిన తమ తొలి 110 సీసీ మోటార్‌సైకిల్ "మహీంద్రా స్టాలియో" ఇప్పుడు కొత్త పేరుతో మార్కెట్లో ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఈ మోటార్‌సైకిల్ గేర్ బాక్సులో సమస్యలు తలెత్తుతున్నాయని వరుస ఫిర్యాదులు అందడంతో కంపెనీ దీని ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రస్తుతం మహీంద్రా స్టాలియోలోని లోపాలన్నింటినీ సవరించి, మరికొన్ని అదనపు మార్పులు చేర్పులు చేసి సరికొత్త పేరుతో త్వరలోనే విపణిలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, 'మహీంద్రా పాంటెరో' అనే పేరుతో ఈ 110సీసీ బైక్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. రిఫ్రెష్ చేయబడిన మహీంద్రా పాంటెరో (స్టాలియో)ను కంపెనీ ప్రస్తుతం టెస్టింగ్ నిర్వహిస్తోంది. గతంలో కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త బైక్ నవంబర్ నెలలో విడుదల కావల్సి ఉంది.

మహీంద్రా పాంటెరో - స్పై షాట్స్

మహీంద్రా పాంటెరో - స్పై షాట్స్

మహీంద్రా స్టాలియో - ఢిల్లీ ఆటో ఎక్స్‌పో

మహీంద్రా స్టాలియో

మహీంద్రా స్టాలియో
మహీంద్రా స్టాలియో మోటార్‌సైకిల్ విషయంలో గతంలో ఎదురైన సమస్యలను, సవాళ్లను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా టూవీలర్స్ తమ కొత్త పాంటెరోను అభివృద్ధి చేసింది. మహీంద్రా పాంటెరో తయారీ కోసం ఇటలీకు చెందిన డిజైన్ సేవల సంస్థ "ఇంజనీర్స్ ఇంజనీరింగ్"తో మహీంద్రా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొత్తగా రానున్న అప్‌గ్రేడెడ్ మహీంద్రా పాంటెరో ఈ సెగ్మెంట్లోని హోండా డ్రీమ్ యుగ, హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో, సుజుకి హయాటే వంటి 110సీసీ మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలువనుంది.
మహీంద్రా తమ కొత్త స్టాలియోను గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. అయితే, స్టాలియో పేరు కంపెనీకు సరిగ్గా కలిసి రాకపోవటంతో కొత్త పేరుతో ఈ 110సీసీ బైక్‌ను రీలాంచ్ చేయాలని మహీంద్రా టూవీలర్స్ యోచిస్తోంది. స్టాలియో మోటార్‌సైకిల్‌కు గతంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరహించాడు. మరి తమ కొత్త పాంటెరో మోటార్‌సైకిల్ కంపెనీ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications








