ఆకర్షనీయమైన ధరకే స్విష్ 125ను విడుదల చేసిన సుజుకి

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ గడచిన జనవరిలో జరిగిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన 125సీసీ స్కటర్ "సుజుకి స్విష్ 125"ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను వివిధ రాష్ట్రాలలో దశల వారీగా వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో నివసించే యువతను, స్టైల్ కోరుని కుర్రకారును దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన సుజుకి స్విష్ 125ను తొలుతగా పట్టణ మార్కెట్లో కంపెనీ విడుదల చేస్తోంది.

ఆ తర్వాత దశల వారీగా దేశవ్యాప్తంగా ఈ స్కూటర్‌ను మార్కెట్ చేయనుంది. ఇటు అబ్బాయిలకు, అటు అమ్మాయిలకు చక్కగా సరిపోయే విధంగా అత్యంత స్టైలిష్‌గా ఈ స్కూటర్‌ను డిజైన్ చేయడం జరిగింది. ఎక్స్టీరియర్స్ పరంగా ఎంతో అందంగా ఉండే సుజుకి స్విష్ 125 పెర్ఫామెన్స్ విషయంలో శభాష్ అనిపించుకోనుంది. సుజుకి నుండి అత్యంత సక్సెస్ అయిన స్కూటర్ యాకెస్స్ 125లో ఉపయోగించిన ఇంజన్‌నే సుజుకి స్విష్ 125లోనూ ఉపయోగించడం జరిగింది. మార్కెట్లో దీని ధర రూ.45,431 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

పెర్ఫామెన్స్‌లో ఇది యాక్సెస్‌తో సమానంగా ఉన్నప్పటికీ స్టయిల్, డిజైన్‌లో యాక్సెస్ కన్నా పది రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఆరు లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్, 20 లీటర్ల కెపాసిటీ కలిగిన అండర్ సీట్ స్టోరేజ్, ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో స్విష్ 125 స్కూటర్ లభిస్తుంది. ఇందులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్)ను ఉపయోగించడం వలన ఇంజన్ మంచి పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 42 కి.మీ. పైగా మైలేజీనివ్వవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, February 17, 2012, 15:23 [IST]
English summary
It is a well known fact that the Suzuki Access 125 has remained an unbeatable product in its segment. It has been so good that Suzuki has been struggling to cater to the high demand. IN an effort to reduce the pressure on the Access 125, Suzuki developed the Swish 125 and unveiled it at the 2012 Delhi Auto Expo. And now the new Suzuki Swish has hit the market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+