రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కు నో వెయిటింగ్ పీరియడ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ ప్రియులకు శుభవార్త. థండర్‌బర్డ్ మోటార్‌సైకిల్‌పై అధిక దూరం ప్రయాణించాలనుకునే వారు ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకోవటానికి అధిక సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఐషర్ గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ లీజర్ మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన థండర్‌బర్డ్ 500ను కొనుగోలుదారులకు తక్షణమే డెలివరీ చేస్తున్నామని కంపెనీ సీఈఓ డా. వెంకి పద్మనాభన్ తెలిపారు.

గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శనకు ఉంచి, ఇటీవలే దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త థండర్‌బర్డ్ 500 మోటార్‌సైకిల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ నేడు బెంగుళూరు మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా పద్మనాభన్ మాట్లాడుతూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల కొనుగోలుదారుల అభిప్రాయాలను సేకరించి, వారి అభిరుచులకు అనుగుణంగా ఈ కొత్త థండర్‌బర్డ్‌ను డిజైన్ చేశామని, ఇది 350సీసీ మరియు 500సీసీ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుందని ఆయన చెప్పారు.
బెంగుళూరు మార్కెట్లో ఈ రెండు మోడళ్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 - రూ.1,86,622
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 - రూ.1,46,466

(అన్ని ధరలు ఆన్-రోడ్, బెంగుళూరు)


కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 మోటార్‌సైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఒక్కసారి ఫుల్ చేస్తే (20 లీటర్లు) 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని (అంటే సగటును లీటరుకు 25 కి.మీ. మైలేజీ అన్నమాట), అలాగే థండర్‌బర్డ్ 350 మోటార్‌సైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఒక్కసారి ఫుల్ చేస్తే (20 లీటర్లు) 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని (అంటే సగటును లీటరుకు 35 కి.మీ. మైలేజీ అన్నమాట) ఆయన చెప్పారు. అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకర్లకు హైవే రైడింగ్‌పై సేఫ్టీ కోసం లెథర్ జాకెట్లు, నైలాజ్ జాకెట్లు, హెల్మట్లు, గ్లౌజ్‌లు, గ్యాడ్జెట్లు వంటి విస్తృతస్థాయ యాక్ససరీలను కూడా ఆఫర్ చేస్తోంది.

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో రెండవ ప్లాంటును ప్రారంభంలోకి తీసుకురావటం ద్వారా ప్రస్తుతం తమ మోటార్‌సైకిళ్లకు అధికంగా ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను త్వరలోనే తగ్గించగలమని పద్మనాభన్ తెలిపారు. తమ కంపెనీ ఈ ఏడాది ఇప్పటికే 75,000 యూనిట్లకు పైగా మోటార్‌సైకిళ్లను విక్రయించిందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ లక్ష యూనిట్ల అమ్మకాలను అధిగమించలమని, ప్రస్తుతం ఎక్కువ భాగం దేశీయ మార్కెట్ నుంచే అమ్మకాలు వస్తున్నాయని, కేవలం 5 శాతం మాత్రమే ఎగుమతులు ఉన్నాయని ఆయన చెప్పారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఫీచర్లు:
ఇందులో 499సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ట్విన్‌స్పార్క్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 5250 ఆర్‌పిఎమ్ వద్ద 27.2 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 41.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌పై విశిష్టమైన బ్లాక్ స్టయిలింగ్, 3డి స్టిక్కరింగ్, ప్రొజెక్టర్, ఎల్ఈడి లైట్ గైడ్ హ్యాలో రింగ్‌తో కూడిన హెడ్‌ల్యాంప్, రెండు ఇండిపెండెంట్ ట్రిప్ మీటర్లు, డిజిటల్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్ప్లిట్ సీట్ (విడిపోయినట్లుగా ఉండే సీట్), వెనుక సీట్లో కూర్చునే పిలియన్ రైడర్‌కు సౌకర్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన బ్యాక్ రెస్ట్ (దీనిని లగేజ్ క్యారియర్ కూడా ఉపయోగించుకోవచ్చు), వెనుక చక్రానికి ఏర్పాటు చేసిన డిస్క్ బ్రేక్, ఈఎల్ఈడి టెయిల్ ల్యాంప్, అవసరం లేదనుకున్నప్పుడు మడుచుకునే వీలున్న రియర్ ఫుట్ రెస్ట్స్, బ్లాక్ కోటింగ్‌తో కూడిన ఇంజన్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 25, 2012, 17:22 [IST]
English summary
It might be a good news for Royal Enfield Thunderbird 500 buyers. According to the Company CEO Dr. Venki Padmanabhan, there is no waiting period for Thunderbird 500. However Thunderbird 350 buyers have wait for few more months to get their dream machine. Royal Enfield is giving an option to the buyers who has already booked the old Thunderbird 350, now they can migrate for new Thunderbird 350.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+