గాలితో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే మోటార్‌సైకిల్

By Ravi

అసలు పెట్రోల్‌తో పనిలేకుండా కేవలం స్వచ్ఛమైన 'గాలి'తో నడిచే మోటార్‌సైకిళ్లు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది..? అవును బాస్.. ఇది పగటి కల కాదు. గాలి వార్త అంతకన్నా కాదు. ఈ కలను నిజం చేసి చూపించారు ఆస్ట్రేలియన్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ప్రతిభకు పదును పెడితే ఆకాశానికి సైతం నిచ్చెన వేయటం అసాధ్యమేమీ కాదు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం కంప్రెస్డ్ ఎయిర్ (పీడనంతో కూడిన గాలి)తో నడిచే మోటార్‌సైకిల్‌ను తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు.

'ఓ2 పర్సూట్'గా పిలిచే ఈ ఎయిర్ గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. ఇందులో ఉన్న ఎయిర్‌ట్యాంక్‌ను ఒక్కసారి ఫిల్ చేసినట్లయితే 100 కిలోమీటర్ల వరకూ ఆగకుండా ప్రయాణించవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్‌ను యమహా డర్ట్ బైక్ (రేస్‌లు, అడ్వెంచర్ రైడ్‌ల కోసం ఉపయోగించే మోటార్‌సైకిల్)ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. యమహా డబ్ల్యూఆర్250ఆర్ బైక్ బాడీ ఫ్రేమ్‌ను తీసుకొని డీన్ బెన్‌స్టీడ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించాడు. దీని ఛాస్సిస్‌పై ఫ్యూయెల్ ట్యాంక్‌ను తీసేసి దాని స్థానంలో ఓ ఎయిర్ ట్యాంక్‌ను ఉంచారు. అలాగే, పెట్రోల్ ఇంజన్ స్థానంలో కంప్రెస్డ్ ఎయిర్‌తో నడిచే 25 పాంగ్ ఇంజన్‌ను అమర్చారు.

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - ఆస్ట్రేలియా స్టూడెంట్స్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - ఆస్ట్రేలియా స్టూడెంట్స్

ప్రకృతి సాన్నిహిత్యమైన ఈ ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్‌ను ఆస్ట్రేలియన్ విద్యార్థులు తయారు చేశారు.

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - రేంజ్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - రేంజ్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్‌లోని కంప్రెస్డ్ ఎయిర్ ట్యాంక్‌ను ఒక్కసారి ఫుల్ చేస్తే దానిపై 100 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - టాప్ స్పీడ్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - టాప్ స్పీడ్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - యమహా బైక్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - యమహా బైక్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్‌ను యమహా డర్ట్ బైర్ డబ్ల్యూఆర్250ఆర్ బైక్ ఫ్రేమ్‌ను ఉపయోగించి తయారు చేశారు.

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - ఇంజన్

ఓ2 పర్సూట్ ఎయిర్ బైక్ - ఇంజన్

యమహా డర్ట్ బైర్ డబ్ల్యూఆర్250ఆర్ బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్‌ను తొలగించి దాని స్థానంలో కంప్రెస్డ్ ఎయిర్ ట్యాంక్‌ను, పెట్రోల్ ఇంజన్ స్థానంలో కంప్రెస్డ్ ఎయిర్‌తో 25 పాంగ్ ఇంజన్‌ను అమర్చారు.

ఓ2 పర్సూట్ - యమహా డబ్ల్యూఆర్250ఆర్

ఓ2 పర్సూట్ - యమహా డబ్ల్యూఆర్250ఆర్

యమహా డబ్ల్యూఆర్250ఆర్ బైక్ బాడీ ఫ్రేమ్‌ను తీసుకొని డీన్ బెన్‌స్టీడ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించాడు.

మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బైక్

మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బైక్

బెంగుళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కంప్రెస్డ్ ఎయిర్‌తో నడిచే మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు. 2012 బెంగుళూరు ఆటో షోలో విద్యార్థులు ఈ ఎయిర్ బైక్‌ను ప్రదర్శనకు ఉంచారు.

టాటా ఎయిర్ కారు

టాటా ఎయిర్ కారు

ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ కూడా గాలితో నడిచే కార్లపై పరిశోధనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఓ2 పర్సూస్ ఎయిర్ బైక్ వీడియో

Article Published On: Sunday, November 11, 2012, 8:02 [IST]
English summary
Here is a bike that runs on pure air. Using a compressed air tank, the O2 Pursuit can run for as many as 100 kilometres and also reach a top speed of 140kmph. This dirt bike has been developed by Australian engineering students. The O2 Pursuit is based on a Yamaha dirt bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+