కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌పై పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ సవారీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా హిట్ తర్వాత ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావచ్చని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్, తమన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రత్యేకించి మీడియాను టార్గెట్ చేస్తూ, సెటైర్లతో రానున్నట్లు సమాచారం. సరే ఇదంతా అటుంచితే.. ఈ సినిమాలో మన పవర్ స్టార్ ఓ పవర్‌ఫుల్ బైక్‌ను నడపారు. ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ కంపెనీ కెటిఎమ్ మోటార్‌సైకిల్ మరియు దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటోలు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సరికొత్త ఆఫ్-రోడ్, అడ్వెంచరస్ బైక్ "కెటిఎమ్ డ్యూక్ 200"ను పవన్ కళ్యాణ్ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాలో ఉపయోగించడం జరిగింది.
ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో హాట్ సెర్చ్‌గా ఉన్నాయి. గడచిన జనవరి నెలలో బజాజ్ ఆటో ఈ సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు, డ్రాగ్ రేసింగ్‌లకు, పవర్‌ఫుల్ బైక్ స్టంట్‌లకు అనువుగా ఉండే ఈ స్పోర్ట్స్ బైక్‌ను మంచి హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది.
బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 ఫోటో గ్యాలరీ:
కెటిఎమ్ డ్యూక్ 200 ఆఫ్-రోడ్ బైక్‌లో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్ ధర రూ.1,20,057 లుగా ఉంది.


Click it and Unblock the Notifications








