కెమెరామేన్ గంగతో రాంబాబులో కెటిఎమ్ డ్యూక్‌పై పవన్ సవారీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు' నేడు వెండితెరల పైకి విచ్చేసింది. విడుదలకు ముందే మార్కెట్లో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రంపై ఇటు అటు పవన్ అభిమానులు అటు సినీ పండితులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి వీరి అంచనాలు నిజమయ్యాయా.. లేక ఆశలు అడియాశలయ్యాయా అని తెలియాలంటే మాత్రం సినిమా చూసి తీరాల్సిందే. గబ్బర్ సింగ్ సినిమా హిట్ తర్వాత పవన్ సక్సెస్ మూవీ ఖాతాలో కెమెరామేన్ గంగతో రాంబాబు కూడా స్థానం సంపాదించుకోనుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్, తమన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకించి మీడియాను టార్గెట్ చేస్తూ, సెటైర్లతో రానున్నట్లు సమాచారం. సరే ఇదంతా అటుంచితే.. ఈ సినిమాలో మన పవర్ స్టార్ ఓ పవర్‌ఫుల్ బైక్‌ను నడపారు.

పన్ కళ్యాణ్ - కెటిఎమ్ డ్యూక్ 200
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు' నేడు వెండితెరల పైకి విచ్చేసింది. ఈ సినిమాలో మన పవర్ స్టార్ ఓ పవర్‌ఫుల్ బైక్‌ను నడపారు.ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ కంపెనీ కెటిఎమ్ అందిస్తున్న సరికొత్త ఆఫ్-రోడ్, అడ్వెంచరస్ బైక్ "కెటిఎమ్ డ్యూక్ 200"ను పవన్ కళ్యాణ్ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాలో ఉపయోగించాడు.

కెటిఎమ్ డ్యూక్ 200 - ఆటో ఎక్స్‌పో
గడచిన జనవరి నెలలో బజాజ్ ఆటో ఈ సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

కెటిఎమ్ డ్యూక్ 200 - ఆఫ్-రోడింగ్
ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు, డ్రాగ్ రేసింగ్‌లకు, పవర్‌ఫుల్ బైక్ స్టంట్‌లకు అనువుగా ఉండే ఈ కెటిఎమ్ డ్యూక్ 200 స్పోర్ట్స్ బైక్‌ను మంచి హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 200 - ఇంజన్
కెటిఎమ్ డ్యూక్ 200 ఆఫ్-రోడ్ బైక్‌లో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కెటిఎమ్ డ్యూక్ 200 - ఫీచర్లు
కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌లో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

కెటిఎమ్ డ్యూక్ 200 - ధర
కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్ ధర రూ.1.3 లక్షలుగా ఉంది.
ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ కంపెనీ కెటిఎమ్ మోటార్‌సైకిల్ మరియు దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటోలు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సరికొత్త ఆఫ్-రోడ్, అడ్వెంచరస్ బైక్ "కెటిఎమ్ డ్యూక్ 200"ను పవన్ కళ్యాణ్ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాలో ఉపయోగించడం జరిగింది.
గడచిన జనవరి నెలలో బజాజ్ ఆటో ఈ సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు, డ్రాగ్ రేసింగ్‌లకు, పవర్‌ఫుల్ బైక్ స్టంట్‌లకు అనువుగా ఉండే ఈ స్పోర్ట్స్ బైక్‌ను మంచి హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది. కెటిఎమ్ డ్యూక్ 200 ఆఫ్-రోడ్ బైక్‌లో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 ఫోటో గ్యాలరీ:
బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200లో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్ ధర రూ.1.3 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications