మరోసారి పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురవారం అర్థరాత్రి నుంటి లీటరు పెట్రోల్‌పై 95 పైసలు చొప్పును తగ్గింపును ప్రకటిస్తూ చమురు కంపెనీలు తమ నిర్ణయాన్ని వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్ ధరను తగ్గించామని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. చమురు కంపెనీలు అక్టోబర్ 9న లీటరు పెట్రోల్‌పై 56 పైసల తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం పెట్రోల్ పంపు డీలర్కు కమిషన్‌ను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తిరిగి 29 పైసలను పెంచారు.
ప్రస్తుతం అంతర్జాతీయ ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.68.19 లకు చేరింది. ఈ ధరలు నగరానికి నగరానిక మధ్య ఉన్న విభిన్న సేల్స్ టాక్స్ లేదా వ్యాట్ రేట్ల కారణంగా ఇవి వేర్వేరుగా ఉంటాయి. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు (ప్రతి లీటరుకు) ఈ విధంగా ఉన్నాయి:
- ఢిల్లీ - రూ. 67.24
- ముంబై - రూ 73.53
- కోల్‌కటా - రూ 74.55
- చెన్నై - రూ 70.57