వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్ ధర తగ్గించిన పియాజ్జియో
ఇటలీకు చెందిన పియాజ్జియో భారతీయ అనుబంధ కంపెనీ పియాజ్జియో వెహికల్స్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన ప్రీమియం లైఫ్ స్టయిల్ స్కూటర్ "వెస్పా ఎల్ఎక్స్ 125" ధరను భారీగా తగ్గించింది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌పై డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. గతంలో ఈ స్కూటర్ దర రూ.74,490 (ఆన్-రోడ్, పూనే)గా ఉండగా, ఇప్పుడు ఇది కేవలం రూ.67,983 (ఆన్-రోడ్, పూనే) లకే లభ్యమవుతోంది.
వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌లో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.26 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. భారత మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది. ఇందులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.

వెస్పా ఎల్ఎక్స్125 ఫెస్టివల్ ఆఫర్:
ఇటాలియన్ కంపెనీ పియాజ్జియో అందిస్తున్న వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌పై కంపెనీ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ప్రీమియం లైఫ్ స్టయిల్ స్కూటర్‌పై కంపెనీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

వెస్పా ఎల్ఎక్స్125 డిజైన్:
ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే.

వెస్పా ఎల్ఎక్స్125 ఇంజన్:
* ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్, 3-వాల్వ్, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్
* డిస్‌ప్లేస్‌మెంట్ - 125సీసీ
* గరిష్ట పవర్ - 10.06 పిఎస్
* గరిష్ట టార్క్ - 10.6 ఎన్ఎమ్

వెస్పా ఎల్ఎక్స్125 కలర్స్:
* నీరో వోల్కానో (బ్లాక్)
* మోన్ట్ బియాన్కో (వైట్)
* రోస్సో డ్రాగన్ (రెడ్)
* గియాల్లో లైమ్ (యెల్లో)
* మిడ్‌నైట్ బ్లూ (బ్లూ)
* రోస్సో చియాంటీ (మెరూన్)

వెస్పా ఎల్ఎక్స్125 డీలర్స్ (హైదరాబాద్):
SMART AUTO
Plot No - 729, Kavya House,
Road No. 36, Jubilee Hills,
Next to IBP Petrol Station,
Hyderabad - 500 033.
040 2355 2377 / 040 2355 2655 / 040 23559355
SPR Automobiles
3-6-307, Hyderguda,
Basheerbagh, Hyderabad - 500029.
040-40264076/9030048490

వెస్పా ఎల్ఎక్స్125 ధరలు (ఎక్స్-షోరూమ్):
* హైదరాబాద్ - రూ. 68,814/-
* సికింద్రాబాద్ - రూ. 68,812/-
* విజయవాడ - రూ. 68,597/-
* వైజాగ్ - రూ. 68,886/-
వెస్పా ఎల్ఎక్స్ 125లో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్ లేదా కిక్ స్టార్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే.
ఇండియన్ కస్టమర్ల కోసం ఎక్స్‌క్లూజివ్ యాక్ససరీస్, మర్చండైస్‌లను కూడా పియాజ్జియో ఆఫర్ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 35 ప్రధాన నగరాల్లో 50 షోరూమ్‌లను ఏర్పాటు చేసి, అక్టోబర్-నవంబర్ 2012 నాటికి ప్రతి నెలా 12,000 వెస్పా స్కూటర్లను విక్రయించాలని పియాజ్జియో లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








