వెస్పా తర్వాత బడ్జెట్ స్కూటర్‌పై పియాజ్జియో కన్ను
వెస్పా ఎల్ఎక్స్125 ప్రీమియం లైఫ్ స్టయిల్ స్కూటర్‌ను విడుదల చేసిన ఇటాలియన్ కంపెనీ పియాజ్జియో ఇప్పుడు తాజాగా ఓ బడ్జెట్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్ ధర అధికంగా ఉన్నప్పటికీ క్లాసిక్ బ్రాండ్, ప్రీమియం లుక్, కంఫర్టబల్ రైడ్ వంటి అనేక లక్షణాలను పరిగణలోకి తీసుకొని కొనుగోలుదారులు ఈ మోడల్‌ను ఎంచుకోవటం జరుగుతోంది.
వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌తో ఇండియన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పియాజ్జియో స్కూటర్ సెగ్మెంట్లో అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే, ప్లై (Fly) అనే 125సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన బడ్జెట్ స్కూటర్‌ను పియాజ్జియో విడుదల చేయనుంది. వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే పియాజ్జియో ఫ్లై స్కూటర్‌లో కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తుంది.
అయితే, వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌లో 3-వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించగా, పియాజ్జియో ఫ్లైలో 2-వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. భారత మార్కెట్లో పియాజ్జియో ఫ్లై స్కూటర్ ధర రూ.50,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ సెగ్మెంట్లోని సుజుకి యాక్సెస్, స్విస్, హోండా యాక్టివా, డియో, టీవీఎస్ వెగో, హీరో మ్యాస్ట్రో వంటి స్కూటర్లతో ఇది పోటీ పడనుంది.
పియోజ్జియో ఫ్లై స్కూటర్‌ను కంపెనీ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తోంది. రానున్న రెండు మూడు నెలల్లో ఈ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్, డ్రమ్ బ్రేక్స్, ముందు వైపు ఆప్షనల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లతో లభ్యం కానుంది.
వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్ విడుదల ఫోటోలు:
ఇందులో ఉపయోగించిన 125సీసీ వెస్పా ఎల్ఎక్స్125 మాదిరిగానే 10 బిహెచ్‌పిల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌లో 3-వాల్వ్ టెక్నాలజీ కారణంగా మెరుగైన మైలేజ్‌ను పొందవచ్చని గతంలో కంపెనీ తెలిపింది. కాగా.. పియాజ్జియో ఫ్లై స్కూటర్‌లో 2-వాల్వ్ టెక్నాలజీ అయినప్పటికీ ఇది కూడా మంచి మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది.


Click it and Unblock the Notifications








