పియాజ్జియో దీపావళి కానుక: ఫ్లై 125సీసీ స్కూటర్‌

By Ravi

స్కూటర్ల తయారీలో పేరుగాంచిన ఇటాలియన్ కంపెనీ పియాజ్జియో గురించి భారతీయులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత స్కూటర్ చరిత్రలో ఓ ఘట్టంగా నిలిచిన పియాజ్జియో ఇటీవలే తమ ప్రీమియం లైఫ్‌ స్టయిల్ స్కూటర్‌ 'వెస్పా ఎల్ఎక్స్125'ను దేశీయ విపణిలో విడుదల చేయటం ద్వారా స్కూటర్ సెగ్మెంట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్ ధర అధికంగా ఉండటం, సామాన్యులకు అందుబాటులో లేకపోవటంతో బడ్జెట్ స్కూటర్‌ను కోరుకునే కొనుగోలుదారుల కోసం కంపెనీ ఓ సరికొత్త స్కూటర్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది.

ఆకర్షనీయమైన డిజైన్, సాటిలేని పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్, సరమైన ధర వంటి ఫీచర్లతో పియాజ్జియో ఓ సరికొత్త బడ్జెట్ స్కూటర్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనుంది. 125సీసీ ఇంజన్‌తో రానున్న ఈ స్కూటర్ ఫ్లై లేదా ఫ్లయర్ (Fly / Flyer) అని పిలిచే అవకాశం ఉంది. వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే పియాజ్జియో ఫ్లై స్కూటర్‌లో కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ, మెరుగైన మైలేజ్‌ను ఆఫర్ చేసేందుకు గాను పియాజ్జియో ఫ్లై స్కూటర్‌లో వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌లో ఉపయోగింటిన 3-వాల్వ్ టెక్నాలజీని కాకుండా ఉపయోగించగా, 2-వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని సమాచారం.


పియోజ్జియో ఫ్లై 125సీసీ స్కూటర్‌ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఈ కొత్త స్కూటర్‌ను పియాజ్జియో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్, డ్రమ్ బ్రేక్స్, ముందు వైపు ఆప్షనల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లతో ఇది లభ్యం కావచ్చని సమాచారం. పియాజ్జియో ఫ్లై 125సీసీ స్కూటర్‌లో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ 10 బిహెచ్‌పిల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పియాజ్జియో ఫ్లై 125సీసీ స్కూటర్ ఫోటోలు:

దేశీయ విపణిలో పియాజ్జియో ఫ్లై 125సీసీ స్కూటర్ ధర రూ.50,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని సుజుకి యాక్సెస్, స్విస్, హోండా యాక్టివా, డియో, టీవీఎస్ వెగో, హీరో మ్యాస్ట్రో వంటి స్కూటర్లతో పోటీ పడనుంది. కాగా.. కంపెనీ అందిస్తున్న ప్రీమియం స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్125 ధర అధికంగా ఉన్నప్పటికీ క్లాసిక్ బ్రాండ్, ప్రీమియం లుక్, కంఫర్టబల్ రైడ్ వంటి అనేక లక్షణాలను పరిగణలోకి తీసుకొని కొనుగోలుదారులు ఈ మోడల్‌ను ఎంచుకోవటం జరుగుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 30, 2012, 12:47 [IST]
English summary
Piaggio had re-entered scooter market in the country with the premium Vespa LX125 recently. The Vespa life style scooter has been highly priced and now, to draw sales volumes, the company is planning to launch another 125cc scooter called Fly / Flyer during this festive season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+