రాష్ట్ర మార్కెట్లో వెస్పా స్కూటర్‌ విడుదల చేసిన పియాజ్జియో

గత నెల 26న మార్కెట్లోకి విడుదల వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్‌కు విచ్చేసింది. ఇటాలియన్ గ్రూపు పియాజ్జియోకు చెందిన భారత అనుబంధ కంపెనీ పియాజ్జియో వెహికల్స్ భారత మార్కెట్లో పునఃప్రవేశపెట్టిన ఐకానిక్ వెస్పా స్కూటర్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా.. వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ కోసం రాష్ట్ర మార్కెట్లో మూడు కొత్త డీలర్‌షిప్‌లను కూడా పియాజ్జియో ప్రారంభించింది.

హైదరాబాద్‌లో ఎస్‌పిఆర్ ఆటోమొబైల్స్, శ్రేయ్ ఆటోమోటివ్, స్మార్ట్ ఆటో‌లు వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌కు డీలర్లుగా వ్యవహరించనున్నాయి. వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌ను తొలిసారిగా 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పియాజ్జియో ఆవిష్కరించింది.

వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌లో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.26 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇండియాలో లభిస్తున్న స్కూటర్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది (పవర్‌ఫుల్). వెస్పా ఎల్ఎక్స్ 125లో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్సును ఉపయోగించారు.

వెస్పా ఎల్ఎక్స్ 125లో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇది ఎలక్ట్రిక్/కిక్ స్టార్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే. రాష్ట్ర మార్కెట్లో వెస్పా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.68,814 గానూ, ఆన్-రోడ్ ధర రూ.79,900 గానూ ఉంది. బుకింగ్ చేసుకున్న నెల రోజుల్లోపే డెలివరీ ఇస్తామని డీలర్లు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో వెస్కా ఎల్ఎక్స్ 125 స్కూటర్ డీలర్ల చిరునామా:

* SMART AUTO
Plot No - 729, Kavya House,
Road No. 36, Jubilee Hills,
Next to IBP Petrol Station, Hyderabad
Pincode : 500 033
Phone Nos: 040 2355 2377 / 040 2355 2655 / 040 23559355

* SPR Automobiles
#3-6-307, Hyderguda,
Basheerbagh, Hyderabad
Pincode : 500029
Phone: 040-40264076

More from DriveSpark

Article Published On: Tuesday, May 8, 2012, 16:24 [IST]
English summary
Piaggio has launched iconic Vespa scooter in Hyderabad and also opened three new dealerships. SPR Automobiles, Shrey Automotive and Smart Auto are the three dealerships in Hyderabad. Here is the addresses and contact numbers of theese dealerships.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+