కొత్త సంవత్సరం కోసం సరికొత్త ఉత్పత్తులు: పయోనీర్

ఇలాంటి ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ల తయారీలో తనదైన బ్రాండ్ ముద్రను వేసుకున్న "పయోనీర్" 2012 సంవత్సరానికి గానూ అందించనున్ను విస్తృత స్థాయి ఉత్పత్తులను జె డబ్ల్యూ మారియోట్‌లో ఆవిష్కరించింది. తమ అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని జోడించి ఈ సరికొత్త ఉత్పత్తులను తయారు చేశామని కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది.
అంతేకాకుండా.. తమ ఉత్పత్తులకు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నట్లు కూడా తెలిపింది. ఈ కొత్త ఉత్పత్తులను షాహిద్ కపూర్ ఆవిష్కరించారు. ఏవీహెచ్-పి8490బిటి, డిఈహెచ్-6450బిటి, డిఈహెచ్-5490ఎస్‌డి వంటి మోడళ్లలో మిక్స్‌ట్రాక్స్ టెక్నాలజీని ఉపయోగించామని, ఇది పూర్తి మ్యూజిక్ లైబ్రరీని డిజె ఎఫెక్ట్‌లతో మిక్స్ చేసి కారులోనే క్లబ్ లాంటి అనుభూతిని కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








