రెబల్‌లో హోండా సిబిఆర్600ఆర్ఆర్ రేస్ బైక్‌పై ప్రభాస్

By Ravi

రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న 'రెబల్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ స్టయిలిష్‌ లుక్‌తో అభిమానులను అలరించనున్నాడు. రాఘవ లారెన్స్‌ డైరెక్షన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ప్రభాస్ ఓ సూపర్‌బైక్‌ను రైడ్ చేస్తూ కనిపించనున్నాడు. జపనీస్ బైక్ మేకర్ హోండా మోటోజిపి రేస్ బైక్‌లను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన 'హోండా సిబిఆర్ 600 ఆర్ఆర్ కోనికా మినోల్టా లిమిటెడ్ ఎడిషన్' బైక్‌ను రెబల్ ప్రభాస్ రైడ్ చేయనున్నాడు. ఇదిగో ఈ ఫోటోలోని రెబల్ వర్కింగ్ స్టిల్‌ను చూడండి. ప్రభాస్, దీక్షాసేథ్‌లు జాలీ రైడ్‌పై వెళ్లటాన్ని ఇందులో గమనించవచ్చు. ప్రభాస్ ఈ సినిమాలో ఇదివరకటి కన్నా మరింత స్టయిలిష్‌గా కనిపించనున్నాడు.

హోండా ఈ 'సిబిఆర్ 600 ఆర్ఆర్ కోనికా మినోల్టా' సూపర్‌బైక్‌ను 2008లో మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. పరిమిత సంఖ్యలో మాత్రమే కంపెనీ వీటిని విక్రయించింది. 2007లో జరిగిన మోటోజిపిలో పాల్గొన్న ఆర్‌సి 212 వి టీమ్ జేఐఆర్ కోనికా మినోల్టా రేస్ బైక్‌ల నుండి స్ఫూర్తి పొంది హోండా సిబిఆర్ 600 ఆర్ఆర్ కోనికా మినోల్టాను డిజైన్ చేసింది. ఈ బైక్‌ను నడిపే వారు ఖచ్చితంగా రేసింగ్ అనుభూతిని పొందేలా దీని ఏరోడైనమిక్స్‌ను తీర్చిదిద్దటం జరిగింది.

కాగా.. ‘రెబెల్' చిత్ర ఆడియో సెప్టెంబర్ 14న విడుదల కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రెబల్ చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరులో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 11, 2012, 11:50 [IST]
English summary
Young Rebel Star Prabhas rides Honda CBR600RR Konica Minolton sports bike in his upcoming film Rebal. This mass action entertainer ‘Rebel’ is going to celebrate its audio launch in Hyderabad on September 14th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+