వేలంలో రూ.73 లక్షల వెల పలికిన ఫెరారీ సూపర్‌బైక్
సూపర్‌కార్లను తయారు చేసే ఫెరారీ సూపర్‌బైక్‌ను తయారు చేస్తే ఎలా ఉంటుంది..? సూపర్‌గా ఉంటుంది కదూ..! ఈ ఫోటోలో కనిపిస్తున్న సూపర్‌బైక్‌ను తయారు చేసింది ఫెరారీనే. ఈ అరుదైన ఫెరారీ మోటార్‌సైకిల్‌ను డేవిడ్ కే 1990-95 మధ్య కాలంలో దీనిని డిజైన్ చేశారు. ఇటాలియన్ కార్ రేసర్ ఎన్జో ఫెరారీకి నివాళిగా డేవిడే కే ఈ మోటార్‌సైకిల్‌ను రూపొందించటం జరిగింది.
గడచిన ఆదివారం మోటార్‌సైకిల్ కోసం వేలం నిర్వహించగా ఇది వేలంలో అత్యధికంగా 1,37,700 డాలర్ల వెల (రూ.73,47,672) పలికింది. 900సీసీ డిఓహెచ్‌స, 4-సిలిండర్, 8-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 105 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను మెగ్నీషియం అల్లాయ్ కేసింగ్‌తో తయారు చేశారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. ఈ సూపర్‌బైక్‌కు 4 సైలెన్సర్‌లు ఉంటాయి.
ఈ మోటార్‌సైకిల్ కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిని పూర్తిగా చేతులతోనే తయారు చేయటం జరిగింది. ఈ మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేయటానికి 3000 గంటల సమయం పట్టిందట. ఎమ్‌వీ అగస్టా కంపెనీ కోసం కూడా డేవిడ్ కే మోటార్‌సైకిళ్లను డిజైన్ చేశారు. ఈ అరుదైన ఫెరారీ మోటార్‌సైకిల్‌ను దక్కించుకోవటం కోసం స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే, జపాన్ వంటి దేశాల నుండి బిడ్డర్లు ఆసక్తిని కనబరిచారు. అయితే, ఈ బైక్‌ను ఎవరు సొంతం చేసుకున్నారనే విషయాన్ని మాత్రం గుప్తంగా ఉంచారు.


Click it and Unblock the Notifications









