దరువు సినిమాలో రవితేజ ఉపయోగించిన బైక్‌లు, కార్లు
మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం 'దరువు' నిన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ది సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్‌లైన్‌తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో మాస్ మాహారాజా గెలిచాడా లేక ఓడిపోయాడా అనేది ప్రేక్షకులే నిర్ణయించాల్సి ఉంది.
ఇక దరువు సినిమా విషయానికి వస్తే.. రవితేజ రెండు క్యారెక్టర్లలో మనకు కనిపిస్తాడు. అందులో ఒకటి చిన్నపాటి దొంగతనాలు చేసే బుల్లెట్ రాజా, మరొకటి పెద్ద పెద్ద స్కామ్‌లు చేసే హోం మంత్రి రవీందర్. ఈ సినిమాలో బుల్లెట్ రాజాకు ఓ బుల్లెట్ బైక్ ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ క్లాసిక్ బుల్లెట్‌ను రవితేజ ఈ సినిమాలో ఉపయోగించటం జరిగింది. దరువు సినిమాలో పలుచోట్ల ఈ బుల్లెట్ బైక్‌ను గమనించవచ్చు.
సరిగ్గా గమనిస్తే.. టిఎన్ 09 ఏవి 1166 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఈ ఎరుపు రంగు బుల్లెట్ హెడ్‌లైట్‌పై బుల్లెట్ రాజా, 1000 సిసి అని రాసి ఉంటుంది. ఈ సినిమా ప్రధమార్థంగా ఎక్కువగా చైన్నై నేపథ్యంలో కొనసాగుతుంది కాబట్టి, తమిళనాడుకు చెందిన బుల్లెట్ బైక్‌ను రవితేజ ఉపయోగించాడు. ఇక రెండవ క్యారెక్టర్ హోం మినిస్టర్ రవీందర్ విషయానికి వస్తే.. ఇతను ఎక్కువగా టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో చక్కర్లు కొడుతుంటాడు.
ఈ సినిమాలో రవితేజ ఓ యమహా బైక్‌ను ఉపయోగించాడు. పసుపు రంగు యమహా ఆర్15 మోటార్‌సైకిల్‌పై రవితేజ రైడ్ చేస్తాడు. ఇక్కడ ఓ మంచి రొమాంటి సీన్ కూడా ఉంటుందనుకోండి. ఇక అని పెద్ద సినిమాల్లో మాదిరిగానే ఇందులో కూడా డొక్కు సుమోలు, డబ్బా స్కార్పియోలను (అంటే నా ఉద్దేశ్యం పాతవి, పనికిరానివి అని) టుపుక్ టుపుక్ మని గాల్లోకి లేపడాన్ని మనం చూడొచ్చు.


Click it and Unblock the Notifications








