తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల వెయిటింగ్ పీరియడ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను సొంతం చేసుకోవాలని ఎవరికి మాత్ర ఆశ ఉండదు చెప్పండి. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఓనర్ కావాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు, కాస్తంత సహనం కూడా ఉండాలి. ఎందుకంటే, ఈ మోటార్‌సైకిళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఆరు నెలల నుండి తొమ్మిది నెలల వరకూ ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణంగా ఈ మోడళ్లకు అధిక డిమాండ్ ఉండటంతో పాటు, వీటి ఉత్పత్తి సామర్థ్యం కూడా తక్కువగా ఉండటమే.

దేశీయ మార్కెట్లోకి ఎన్ని విదేశీ కంపెనీల బైక్‌లు వస్తున్నప్పటి, చీప్ అండ్ బెస్ట్ ధరలో రాయల్ లుక్ అండ్ ఫీల్‌ను అందించే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఉన్న క్రేజే వేరు. ఈ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఐషర్ మోటార్ (రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృ సంస్థ) నిర్ణయించింది. ఇందులో భాగంగానే చెన్నైలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రానున్న ఐదేళ్లలో రూ.350 కోట్ల పెట్టుబడులను ఐషర్ మోటార్స్ వెచ్చించనుంది.

చెన్నైలో ఏర్పాటు చేస్తన్న ఈ కొత్త యూనిట్ మొదటి దశ 2013 మొదటి త్రైమాసికం నాటికి పూర్తి కానుంది. దీని ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 1,50,000 యూనిట్లకు పెరగనుంది. ఈ ప్లాంటు పూర్తిగా నిర్వణలోకి వచ్చినట్లయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. గడచిన మార్చి నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 9,000 యూనిట్లకు పైగా మోటార్‌సైకిళ్లను విక్రయించింది. కాగా.. ఈ సంవత్సరంలో 1,00,000 మోటార్‌సైకిళ్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని కంపెనీ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఐషర్ మోటార్స్ గడచిన మార్చి 31, 2012తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో పన్ను అనంతర ఏకీకృత నికర లాభం 33.34 శాతం వృద్ధిని సాధించి రూ.163.43 కోట్లుగా నమోదైందని ఐషర్ మోటార్స్ పేర్కొంది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.122.57 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 17, 2012, 17:05 [IST]
English summary
With the increase demand for its motorcycles, the maker of Royal Enfield, Eicher Motors Limited has planning to speed up its new plant construction at Chennai. For this, company is investing Rs 350 crore in Tamil Nadu state for the period of 5 years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+