రెడీ ఫర్ రిలీజ్: రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్
లీజర్, టూరింగ్ మోటార్‌సైకిళ్లను తయారు చేయటంలో ప్రసిద్ధి గాంచిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన 'కెఫే రేసర్ 535' మోటార్‌సైకిల్ విడుదలకు ముస్తాబవుతోంది. ప్రత్యేకించి యువతను దృష్టిలో ఉంచుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన ఈ మోటార్‌సైకిల్‌ను కొత్త సంవత్సరంలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల మిలాన్‌లో జరిగిన ఈఐసిఎమ్ఏ ఆటో షోలో ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ప్రొడక్షన్ వెర్షన్ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.
కెఫే రేసర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న ఇతర మోటార్‌సైకిళ్ల మాదిరిగా కాకుండా, తక్కువ దూరాలు ప్రయాణించే వారి కోసం, ప్రత్యేకించే వేగం అంటే ఇష్టపడే యువత కోసం తయారు చేసింది. ఇందులో 535సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది తేలిక బరువును కలిగి ఉండి ఎక్కువ వేగంతో పరుగులు తీస్తుంది. ఆకర్షనీయమైన డిజైన్, క్లాసిక్ స్పోక్ వీల్స్, ముందు మరియు వెనుక చక్రాలకు అమర్చిన డిస్క్ బ్రేక్, స్ప్లిట్ హ్యాండిల్ బార్, హ్యాండిల్‌పై చివర్లో అమర్చిన సైడ్ వ్యూ మిర్రర్స్, మెరుగైన సస్పెన్షన్, డిజిటల్ అనలాగ్ కాంబినేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్ సొంతం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల మిలాన్‌లో జరిగిన ఈఐసిఎమ్ఏ ఆటో షోలో ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ప్రొడక్షన్ వెర్షన్ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
స్ప్లిట్ హ్యాండిల్ బార్, డిజిటల్ అనలాగ్ కాంబినేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
రియర్ డిస్క్ బ్రేక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
హ్యాండిల్ బార్‌పై చివర్లో అమర్చిన సైడ్ వ్యూ మిర్రర్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
మెరుగైన సస్పెన్షన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535 రియర్ వ్యూ

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535 ఫ్రంట్ వ్యూ

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
ఈఐసిఎమ్ఏ ఆటో షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535
రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535: వీడియో
Image Source: Image Shack


Click it and Unblock the Notifications








