సస్పెన్షన్‌లో సమస్య: 375 యూనిట్ల 1199 పనిగేల్ బైక్‌లు రీకాల్

ఇటలీకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ డ్యుకాటి తాజాగా గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ సూపర్‌బైక్ ''1199 పనిగేల్" (Ducati 1199 Panigale)ను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. డ్యుకాటి 1199 పనిగేల్ సూపర్‌బైక్‌లో ఉపయోగించిన వెనుక సస్పెన్షన్‌లో లోపం కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. మొత్తం 375 డ్యుకాటి 1199 పనిగేల్ సూపర్‌బైక్‌లో ఈ సమస్య ఉన్నట్లు డ్యుకాటి పేర్కొంది.

డ్యుకాటి 1199 పనిగేల్ సూపర్‌బైక్‌ను మార్కెట్లో విడుదల చేసిన తర్వాత ఈ బైక్ వెనుక షాక్‌అబ్జార్వర్ (రియర్ సస్పెన్షన్)లో ఉపయోగించిన ఓ లోపపూరితమైన స్క్రూను గుర్తించారు. దీనిని సరిచేయకుండా అలానే వదిలేసినట్లయితే, సస్పెన్షన్‌లో సమస్యలు రావచ్చు. అందుకే దీనిని సరిచేసేందుకు వీటిని రీకాల్ చేస్తున్నామని డ్యుకాటి తెలిపింది. ఈ రిపేర్‌ను ఉచితంగా చేస్తామని, ఈ రీకాల్ గురించి తమ కస్టమర్లకు ప్రత్యేకంగా తెలియజేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


డ్యుకాటి గతేడాది నవంబర్ నెలలో 24,000 డాలర్ల ధరతో (మన దేశ కరెన్సీలు రూ.13 లక్షలకు పైమాటే) 1199 పనిగేల్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ను కంపెనీ యొక్క పనిగేల్ ప్లాంటులో తయారు చేసిన కారణంగా డ్యుకాటి దీనికి ఆ పేరును పెట్టడం జరిగింది. ఇది స్టాండర్డ్, ఎస్ మోడల్, ట్రైకలర్ ఎస్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈ సూపర్‌బైక్‌లలో ఎలక్ట్రానికి సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్విక్ షిఫ్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రీకాల్ డ్యుకాటికి కొత్తేమీ కాదు, గడచిన సంవత్సరంలో కంపెనీ అనేకసార్లు మోటార్‌సైకిళ్లను రీకాల్ చేసింది. గతంలో బ్రేక్ లోపం కారణంగా 283 2012 వెర్షన్ బైక్‌లను, వెనుక చక్రం లోపం కారణంగా 900 మోన్‌స్టర్ 1100 ఈవీఓ బైక్‌లను, ఫ్రీ ఫ్యూయెల్ లీక్ వాల్వ్‌ను రీప్లేస్ చేసేందుకు 900 మోటార్‌సైకిళ్లను కంపెనీ రీకాల్ చేసింది.

వివిధ వేరియంట్లలో లభిస్తున్న డ్యుకాటి 1199 పనిగేల్ బైక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* డ్యుకాటి 1199 పనిగేల్ - $24,000 (సుమారు రూ.13.4 లక్షలు)
* డ్యుకాటి 1199 పనిగేల్ ఏబిఎస్ వేరియంట్ - $25,195 (సుమారు రూ.14.12 లక్షలు)
* డ్యుకాటి 1199 పనిగేల్ ఎస్ ఏబిఎస్ వేరియంట్ - $31,595 (సుమారు రూ.17.68 లక్షలు)
* డ్యుకాటి 1199 పనిగేల్ ఎస్ ట్రైకలర్ వేరియంట్ - $37,585 (సుమారు రూ.21.05 లక్షలు)

More from DriveSpark

Article Published On: Wednesday, June 27, 2012, 10:13 [IST]
English summary
Italian sports bike manufacturer Ducati has recalled 375 numbers of 1199 Panigale super bikes due to rear suspension problem. A defective screw in the suspension may lead to problems with rear suspension. Company will fixe this free of cost.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+