డీజిల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లకు ఇదే సరైన సమయం

డీజిల్ బుల్లెట్ మోటార్‌సైకిళ్లు గుర్తు ఉన్నాయా..? ఒకప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపిన మోటార్‌సైకిళ్లు అవి. భారతదేశపు అతి పురాతన ద్విచక్ర వాహన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గతంలో అందించిన డీజిల్ ఇంధనంతో నడిచే బుల్లెట్‌లు కాలక్రమేనా చరిత్రలో కలిసిపోయాయి. అయితే, ఇప్పుడు వాటికి ప్రాణం పోయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

పెట్రోల్ ధరలు భగ్గమంటున్న ప్రస్తుత రోజుల్లో లీటరుకు రూ.80 లకు పైగా చెల్లించి పెట్రోల్‌ను కొనుగోలు చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అదే డీజిల్‌తో నడిచే బుల్లెట్ మోటార్‌సైకిల్ లీటర్ డీజిల్‌తో సుమారు 80 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుంది. పర్యావరణ కాలుష్యం దృష్ట్యా డీజిల్ బుల్లెట్‌ల ఉత్పత్తి, విక్రయాలను కంపెనీ నిలిపివేసింది.


అయితే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక డీజిల్ సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని డీజిల్‌తో నడిచే బుల్లెట్ బైక్‌లను తయారు చేస్తే వాటికి ఖచ్చితంగా ఆమోదం లభించటం ఖాయం. కాలగమనంలో కలిసిపోయిన బుల్లెట్ మోటార్‌సైకిళ్లను తిరిగి ప్రాణం పోయాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా కల కంటోంది. డీజిల్‌ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్లను పునఃప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ ధరలు తారాజువ్వల్లా నింగికెగరుతున్న నేపథ్యంలో ఇలాంటి డీజిల్ బైక్‌లు గనుక మార్కెట్లో లభించినట్లయితే, అవి హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయనండలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ మన కోసం డీజిల్ మోటార్‌సైకిళ్లను పునఃప్రవేశపెట్టాలని కోరుకుందాం..!!

More from DriveSpark

Article Published On: Tuesday, May 29, 2012, 13:10 [IST]
English summary
This is the right time to introduce Diesel powered motorcycles in India as the petrol prices are continuously going up. India's leading motorcycle manufacturer Royal Enfield is also thinking to relaunch the diesel variant bikes soon for Indian market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+