మే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త థండర్‌బర్డ్ 500 విడుదల

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే దేశీయ విపణిలోకి రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆవిష్కరించిన సరికొత్త "థండర్‌బర్డ్ 500" మోటార్‌సైకిల్‌తో పాటుగా "కెఫే రేసర్" మోటార్‌సైకిల్‌ను కంపెనీ దేశీయ విపణిలోకి వాణిజ్యపరంగా ప్రవేశపెట్టనుంది.

ఈ రెండు మోడళ్లకు మార్కెట్ నుండి మంచి స్పందన లభిస్తోంది. కొత్త థండర్‌బర్డ్ 500 కోసం ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రానున్న మే లేదా జూన్ నెలలో కొత్త థండర్‌బర్డ్ 500 వాణిజ్యపరంగా మార్కెట్లో లభ్యం కానుంది. ఇది కాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన స్టన్నింగ్ మోటార్‌సైకిల్ కెఫే రేసర్ మాత్రం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది.

కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ పాపులర్ 500సీసీ ఇంజన్‌ను ఉపయోగించి తీర్చిదిద్దింది. స్టయిలిష్ రైడింగ్ కోరుకునే యువతను దృష్టిలో ఉంచుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోటార్‌సైకిల్‌ను తీర్చిదిద్దింది. ఈ బైక్ కోసం మరో ఏడాది పాటు వేచి ఉండాల్సిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, February 29, 2012, 13:17 [IST]
English summary
Royal Enfield, will launch Thunderbird 500 and Cafe Racer motorcycle in the upcoming months. The company expects to launch Thunderbird 500 in the month of May or June and Cafe racer will be launched by the first quarter of the 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+