రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పరదాలు తొలగించుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 మోటార్‌సైకిల్ కోసం బుల్లెట్ బైక్ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అధునాత సాంకేతిక పరిజ్ఞాన్ని జోడించుకొని సరికొత్త ఫీచర్లతో ముస్తాబయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ను చూసినప్పటి నుండి దీనిని సొంతం చేసుకునేందుకు బైక్ లవర్స్ ఇప్పటికీ వేచి ఉన్నారంటే, ఈ కొత్త మోడల్‌పై ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.
తాజా మార్కెట్ సమాచారం ప్రకారం, థండర్‌బర్డ్ 500సీసీ మోటార్‌సైకిల్‌ను వీలైనంత త్వరలో మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే ఈ మోడల్‌ను ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ స్టన్నింగ్ మోటార్‌సైకిల్ మార్కెట్లో విడుదలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 మోటార్‌సైకిల్‌కు సంబంధించిన సరికొత్త సమాచారం మా పాఠకుల కోసం...
పవర్‌ఫుల్ 500సీసీ ఇంజన్‌తో ప్రీమియం బైక్ లవర్స్‌ను దృష్టిలో ఉంచుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500లో ముందు, వెనుక వైపుల అమర్చిన డిస్క్ బ్రేక్స్, ట్రిప్ మీటర్ మరియు టాకోమీటర్‌లతో కూడిన సరికొత్త డ్యాష్‌బోర్డ్, ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 సాంకేతిక వివరాలు:
* 499సీసీ సింగిల్ సిలిండర్ ట్విన్‌స్పార్క్, ఓహెచ్‌వి ఎయిర్ కూల్డ్ ఇంజన్
* గరిష్ట పవర్ - 5250 ఆర్‌పిఎమ్ వద్ద 27.2 బిహెచ్‌పి
* గరిష్ట టార్క్ - 4000 ఆర్‌పిఎమ్ వద్ద 41.3 ఎన్ఎమ్
* బోర్ x స్ట్రోక్ : 84 x 90 మి.మీ.
* కంప్రెషన్ నిష్పత్తి - 8.5:1
* గేర్ బాక్స్: 5-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
* డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ సిస్టమ్
* ఫ్రంట్ టైర్: 90/90 - 19
* వెనుక టైర్: 120/80 - 18
* ముందు బ్రేక్: 280 మి.మీ. డిస్క్, టూ పిస్టన్ కాలిపర్
* వెనుక బ్రేక్: 240 మి.మీ. డిస్క్, సింగిల్ పిస్టన్ కాలిపర్
* ముందు సస్పెన్షన్: టెలిస్కోపిక్ 41 మి.మీ. ఫోర్క్స్, 130 మి.మీ. స్ట్రోక్
* వెనుక సస్పెన్షన్: ట్విన్ గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్స్ 80 మి.మీ. స్ట్రోక్
* ప్రొజెక్షన్ టైప్ హెడ్‌ల్యాంప్స్ (హెచ్7 బల్బ్ 55/55 వాట్)
* ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్స్
* 20 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం
* 2060 మి.మీ. పొడవు
* 1300 మి.మీ. ఎత్తు
* 896 మి.మీ. వెడల్పు
* 1350 మి.మీ. వీల్‌బేస్
* 195 కేజీలు బరువు
* అంచనా ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.5 లక్షల రేంజ్.


Click it and Unblock the Notifications









