స్కూటర్స్ ఇండియాను పునరుద్ధరిస్తాం: ప్రఫుల్ పటేల్
వాస్తవానికి గడచిన సంవత్సరం మే నెలలో స్కూటర్స్ ఇండియా కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 95 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన ఐదు శాతం వాటాలు బ్యాంకు, ఆర్థిక సంస్థలు మరియు కార్పేరేట్ల వద్ద ఉంది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం తన అభిప్రాయం మార్చుకున్నట్లు ఆయన తెలిపారు.
స్కూటర్స్ ఇండియా లిమిటెడ్‌ను ఎలా పునరుద్ధరించాలి? అసలు పునరుద్ధరించాలా వద్దా? అనే అంశంపై క్యాబినెటే నిర్ణయం తీసుకుంటుందని సీఐఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. గడచిన 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి స్కూటర్స్ ఇండియా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. మార్చి 2009లో కంపెనీ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసింది.
ఎస్‌ఐఎల్‌లో ప్రస్తుతం 1,200 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. 1972లో ప్రారంభమైన స్కూటర్స్ ఇండియా కంపెనీ తొలుతగా దేశీయ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్ పేరుతో స్కూటర్లను అలాగే, విదేశీయ మార్కెట్ల కోసం లాంబ్రెట్టా పేరుతో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అనంతరం విక్రమ్ బ్రాండ్ పేరుతో త్రిచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. కానీ.. 1997లో స్కూటర్ల ఉత్పత్తిని నిలిపివేసి కేవలం త్రిచక్ర వాహనాల ఉత్పత్తికి మాత్రమే పరిమితమైంది.


Click it and Unblock the Notifications









