దొంగిలించిన బ్యాడ్జ్‌లను ఉచితంగా రీప్లేస్ చేయనున్న స్కొడా
ఈ నేపథ్యంలో ఇలా దొంగిలించబడిన లోగోలను ఉచితంగా రీప్లేస్ చేస్తామని చెక్ రిపబ్లిక్‌కు చెందిన కార్ మేకర్ స్కొడా ఇండియా ముందుకు వచ్చింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఆఫర్ కేవలం ముంబైలో మాత్రమే అందుబాటులో ఉంది. స్కొడా తయారీ ప్లాంట్ మహారాష్ట్రలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. లోగోలు లేకుండా సిటీలో తిరుగుతున్న తమ బ్రాండ్ కార్లకు ఉచితంగా లోగోలను రీప్లేస్ చేస్తామని స్కొడా పేర్కొంది.
సాధారణంగా స్కొడా బ్యాడ్జ్‌లను పొందాలంటే వాటి ధరలు రూ.600 నుండి రూ.1500 వరకూ ఉంటాయి. స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌కు ఉపయోగించే బ్యాడ్జ్ ధర రూ.600గా ఉండగా, స్కొడా యెటి ఎస్‌యూవీకి ఉపయోగించే బ్యాడ్జ్ ధర రూ.1500గా ఉంది. సాధారణంగా కారుకు ముందు వైపు, వెనుక వైపు బ్యాడ్జ్‌లు లేకుండా కారు నడపడమంటే ఎవరికైనా చిరాకుగానే ఉంటుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న స్కొడా ముంబైలో ఉచితంగా బ్యాడ్జ్‌లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది.
ఇలా బ్యాడ్జ్‌లను ఉచితంగా రీప్లేస్ చేయటం వలన వీధి దుకాణాల్లో దొంగిలించిన బ్యాడ్జ్‌లను కొనుగోలు చేయటం తగ్గుతుంది, ఫలితంగా వీటిని దొంగిలించడం కూడా తగ్గుతుందనేది స్కొడా భావన. ఏదైతేనేం.. ఈ సదుపాయం దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తే ఎంత బావుంటుదో కదా..!!


Click it and Unblock the Notifications









