స్కొడా సూపర్బ్‌లో వెట్ అంబ్రెల్లా హోల్డర్ ఫీచర్

స్కొడా అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'సూపర్బ్' అనేక విశిష్టమైన ఫీచర్లతో లభిస్తుంది. అందులో ప్రత్యేకించి చెప్పుకోదగిన ఫీచర్ 'వెట్ కేస్ అంబ్రిల్లా హోల్డర్'. అసలే వర్షాకాలం కదా.. ఈ వానల్లో కారులో నుంచి బయటకు దిగి వెళ్లాలనుకున్నప్పుడు గొడును వాడుతాం. మరి తడిచిన గొడును కారు లోపల పెట్టడం ఎలా..? అందుకే ఇలా తడిచిన గొడుగులను కారులో చుక్క నీటి బొట్టు కూడా ఉండేలా స్కొడా సూపర్బ్ సెడాన్‌లో ఈ అంబ్రెల్లా హోల్డర్‌ను అమర్చబడింది.

కారు డోరుకు సైడు భాగంలో ఉండే ఈ అంబ్రెల్లా హోల్డర్ ప్రత్యేకమైన డ్రైనేజ్ సిస్టమ్‌ను కలిగి ఉండి, తడిచిన గొడులను ఈ అంబ్రెల్లా హోల్డర్‌లో పెట్టినప్పుడు అందులోని నీరు మొత్తం కారు క్రింది భాగం నుండి బయటకు వచ్చే ఏర్పాటుతో దీనిని రూపొందించటం జరిగింది. సాధారణంగా తడిచిన గొడుగులను కారులో ఉంచితే తడి కారణంగా లోపలి ఇంటీరియర్స్ పాడయ్యే అవకాశం ఉంది. స్కొడా సూపర్బ్‌లో ఈ అంబ్రెల్లా హోల్డర్ ఉండటం వలన ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.

ఇక స్కొడా సూపర్బ్ సెడాన్ విషయానికి వస్తే.. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ స్కొడా సూపర్బ్ గరిష్టంగా 160 పిఎస్‌ల శక్తిని, డీజిల్ వేరియంట్ స్కొడా సూపర్బ్ 140 పిఎస్‌ల గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. ఇంకా ఇందులో కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, బై-జెనాన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ముందువైపు డ్రైవర్, ప్యాసింజర్ సీట్లను 12 రకాలు సర్దుబాటు (12-వే అడ్జస్టబల్) చేసుకునే వెసలుబాటు వంటి ఫీచర్లున్నాయి.

హైదరాబాద్‌లో స్కొడా సూపర్బ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* స్కొడా సూపర్బ్ యాంబిషన్ 1.8 టిఎస్ ఎమ్‌టి పెట్రోల్ - రూ. 18,32,000
* స్కొడా సూపర్బ్ ఎలిగాన్స్ 1.8 టిఎస్ ఎమ్‌టి పెట్రోల్ - రూ. 19,94,844
* స్కొడా సూపర్బ్ ఎలిగాన్స్ 1.8 టిఎస్ ఏటి పెట్రోల్ - రూ. 21,47,512
* స్కొడా సూపర్బ్ యాంబిషన్ 2.0 టిడిఐ ఏటి డీజిల్ - రూ. 22,90,000
* స్కొడా సూపర్బ్ ఎలిగాన్స్ 2.0 టిడిఐ సిఆర్ ఏటి డీజిల్ - రూ. 24,42,666
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Wednesday, June 27, 2012, 17:47 [IST]
English summary
Did you know that the SKODA superb comes with a wet case umbrella holder? The unique wet case in the left rear door allows for easy storage of umbrella and is equipped with a drainage system to accommodate a wet umbrella so that the interiors are not damaged by the dampness.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+