టూవీలర్ మైలేజ్‌ను పెంచే ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ

ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. బైక్ ప్రియులు పవర్, పెర్ఫామెన్స్‌లతో పాటు మైలేజ్‌కు కూడా అధిక ప్రధాన్యత ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా, అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లపై కొనుగోలుదారులు మక్కువ చూపుతున్నారు.

దీంతో ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు కూడా బైక్‌ల మైలేజ్‌ను మెరుగుపరచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటి వరకూ కార్లకు మాత్రమే ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని ఇకపై ద్విచక్ర వాహనాల్లో కూడా ఉపయోగించనున్నారు. ఈ ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీనే మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు.

ప్రముఖ విడిభాగాల తయారీ కంపెనీ ఎస్‌కెఎఫ్ ద్విచక్ర వాహనాల కోసం స్టాప్-స్టార్ట్ టెక్నాలజీని సరఫరా చేయనుంది. 'స్టాప్‌గో' (StopGo) అనే పేరుతో ఎస్‌కెఫ్ అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్‌ను మోటార్‌సైకిళ్లు, స్కూటర్లలో ఉపయోగించనున్నారు. ఈ కొత్త సిస్టమ్ తక్కువ కర్భన ఉద్ఘాలను వెలువడేలా చేయటమే కాకుండా, డ్రైవింగ్ కండిషన్‌ను బట్టి మైలేజ్‌ను కూడా 6 శాతం నుంచి 10 శాతం వరకూ మెరుగుపరచడంలో సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఎస్‌కెఎఫ్ ఇప్పటికే టీవీఎస్ అపాచీ, బజాజ్ పల్సర్, హీరో కరిజ్మా మోటార్‌సైకిళ్లలో ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించి చూపింది. ఎలక్ట్రిక్ స్టార్ట్ లేని సాధారణ మోటార్‌సైకిళ్లలో సైతం ఇది పనిచేస్తుందని కంపెనీ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే దీనిని మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. కొత్తగా తయారయ్యే ద్విచక్ర వాహనాలకే కాకుండా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాలకు కూడా ఈ సిస్టమ్‌ను అమర్చుకోవచ్చని తెలుస్తోంది.

మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీగా పిలిచే ఈ ఆటో స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను మహీంద్రా తమ స్కార్పియో ఎస్‌యూవీలో ఉపయోగిస్తుంది. వాహనంలో ఈ సిస్టమ్‌ను అమర్చడం వలన ఇంజన్ ఐడిల్‌గా ఉండటాన్ని ఇది గుర్తించి ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది. మళ్లీ తిరిగి క్లచ్‌ను నొక్కగానే ఇంజన్ ఆటోమేటిక్‌గా అవుతుంది. ద్విచక్ర వాహనాల్లో కూడా ఈ సిస్టమ్ ఇదేవిధంగా పనిచేయనుంది.

లాంగ్ ట్రాఫిక్ జామ్స్, పెద్ద పెద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి ప్రాంతాల్లో ఇంజన్‌ను ఐడిల్‌గా ఉంచుతాం. ఇలాంటి సమయాల్లో ఇంధనం వృధాగా ఖర్చు అవుతుంది. అయితే, ఈ ఆటో స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను అమర్చడం వలన ఇంజన్ ఐడిల్‌గా ఉండటాన్ని ఇది గుర్తించి నిర్ధిష్ట సమయం తర్వాత ఇంజన్ ఆఫ్ అయ్యేలా చేసి ఇంధనం వృధా కాకుండా చేస్తుంది. దీని వలన కేవలం ఇంధనం మాత్రమే ఆదా కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేసినట్లు అవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 3, 2012, 18:55 [IST]
English summary
Fuel efficient bikes have always been, an apple of eye for Indian bikers. SKF the component major, is gearing up with new technology, to give rise to bikes, which are more fuel efficient. The component manufacturer, has developed a stop-start technology for two-wheelers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+