అమ్మాయిలు, అబ్బాయిల కోసం సరికొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్లు
ఫుట్‌పాత్‌లపై విక్రయించే హెల్మెట్‌లు నాణ్యతను కలిగి ఉండవి. వాటిపై బోగస్, నకిలీ ఐఎస్ఐ మార్కును వేసి అమ్ముతుంటారు. ఇవి ఎంత మాత్రం సురక్షితమైనవి కావు. అందుకే, కాస్త ఖరీదైనప్పటికీ.. బ్రాండెడ్ హెల్మెట్లనే కొనుగోలు చేయటం మంచిది.
హెల్మెట్‌ల తయారీ పేరుగాంచిన స్టీల్‌బర్డ్ అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రత్యేకమైన హెల్మెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ తాజా కొత్త రేంజ్ హెల్మెట్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. మహిళల కోసం ఈవ్ హెల్మెట్‌ను విడుదల చేయగా, పురుషుల కోసం క్రూజ్, జొర్రో రేంజ్ హెల్మెట్లను స్టీల్‌బర్డ్ విడుదల చేసింది.
ఈవ్, క్రూజ్ హెల్మెట్లు తక్కువ బరువును కలిగి ఉండే ఓపెన్ ఫేస్ హెల్మెట్లు. ఇవి పింక్, సిల్వర్, రెడ్, బేబీ పింక్, వైట్, బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. ఇవి రెండూ కూడా యాంటీ-స్క్రాచ్ విజర్ (గీతలను తట్టుకునే ఫైబర్ విండ్‌షీల్డ్)ను కలిగి పై భాగంలో ఎయిర్ వెంట్స్‌ను కలిగి ఉంటాయి. ఈ హెల్మెట్ లోపల ఉండే కుషన్‌ను పూర్తిగా రీప్లేస్ చేసుకోవచ్చు.
స్పోర్టీ హెల్మెట్ కోరుకునే వారి కోసం కంపెనీ జొర్రో హెల్మెట్‌ను అందిస్తోంది. ఇది రెండు రంగుల కాంబినేషన్‌తో రెండేసి విజర్స్ (డార్క్, ప్లెయిన్)తో లభిస్తుంది. బ్లాక్ ఆన్ సిల్వర్, బ్లూ ఆన్ వైట్, గ్రే ఆన్ బ్లాక్, కలర్ కాంబినేషన్లలో ఇది లభిస్తుంది. ఇది ఫుల్ ఫేస్ హెల్మెట్. దీనికి రెండు ముందు వైపు, పై భాగంలో రెండేసి ఎయిర్ వెంట్స్ ఉంటాయి. దీని ఇంటీరియర్ కుషన్స్‌ను కూడా పూర్తిగా రీప్లేస్ చేసుకోవచ్చు.
స్టీల్‌బర్డ్ అందిస్తున్న ఈ లేటెస్ట్ హెల్మెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* స్టీల్‌బర్డ్ ఈవ్- రూ.1,139
* స్టీల్‌బర్డ్ క్రూజ్ - రూ.1,349
* స్టీల్‌బర్డ్ జొర్రో - రూ.2,199
ఇవే కాకుండా స్టీల్‌బర్డ్ 'కార్బన్ ఫైబర్ హెల్మట్'లను కూడా అందిస్తోంది. స్టీల్‌బర్డ్ అందిస్తున్న ఈ కార్బన్ ఫైబర్ హెల్మెట్‌ల ధరలు రూ.10,000 నుంచి ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications









