బైక్‌ల కోసం రివర్స్ గేర్‌బాక్స్‌ను అభివృద్ధి చేసిన విద్యార్థులు
కార్లను వెనకకు డ్రైవ్ చేయాలంటే రివర్స్ గేర్ వేస్తే సరిపోతుంది. మరి బైక్‌లను రివర్స్ చేయాలంటే, బైక్ దిగి చేతుల్తో వెనక్కు నెట్టడం తప్ప వేరే దారి లేదు. చిన్న బైక్‌లైతే సులువుగా వెనక్కు నెట్టేయగలం కానీ అధిక భారం కలిగిన బైక్‌లను వెనక్కు తిప్పాలంటే కాస్తంత కష్టమే. అది కూడా ఎత్తు పల్లాలు ఉన్న చోట బైక్‌ను రివర్స్ చేయాలంటే కష్టం. ఇలాంటప్పుడు బైక్‌లకు కూడా ఎంచక్కా రివర్స్ గేర్ ఉంటే ఎంత బావుంటో అనిపిస్తుంది కదా..!!
ఇలాంటి ఆలోచనే విద్యార్థులకు కూడా తోచింది. ఇంకేముంది.. వెంటనే బైక్‌ల కోసం కూడా రివర్స్ గేర్‌ను కనిపెట్టేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కురుక్షేత్రలో ఉన్న తేరీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థుల బృందం మోటార్‌సైకిళ్ల కోసం రివర్స్ గేర్‌బాక్స్‌ను అభివృద్ధి చేశారు. తమ కళశాల ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులు ఈ గేర్‌బాక్స్‌ను డిజైన్ చేసి, అందరీ చేత శభాష్ అనిపించుకున్నారు.
వికలాంగులు లేదా వయసు మళ్లిన వాళ్లు ఉపయోగించే మూడు చక్రాలు కలిగిన మోటార్‌సైకిళ్లకు ఈ గేర్‌బాక్‌ను అమర్చవచ్చు. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు బైక్‌లను రివర్స్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అందుకే వీరి కష్టాలను దూరం చేసేందుకు విద్యార్థులు ఈ వినూత్న గేర్‌బాక్స్‌ను కనిపెట్టారు. ఇంజన్‌కు పక్కన ఉండే ఓ లివర్ చేతితో ఆపరేట్ చేయడం ద్వారా మోటార్‌సైకిళ్లను సులువుగా రివర్స్ చేయవచ్చు.
గేర్‌బాక్స్ కూడా ఇంజన్‌కు పక్కనే అమర్చబడి ఉంటుంది. ఈ రివర్స్ గేర్‌బాక్స్‌ను కేవలం రూ.4,500 నుంచి రూ.5,500 రేంజ్‌లోనే అందించవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. వికలాంగులకు, వయో వృద్ధులకు ఈ రివర్స్ గేర్‌బాక్స్ చక్కగా ఉపయోగపడుతుంది. ఏదేమైనప్పటికీ, విద్యార్థుల ప్రతిభను మాత్రం మెచ్చుకోక తప్పదు.


Click it and Unblock the Notifications









