హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన సుజుకి హయాటే
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసిన బడ్జెట్ బైక్ 'సుజుకి హయాటే' రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో, శక్తివంతమైన ఇంజన్ పెర్ఫామెన్స్ కలిగిన బైక్ కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని 110సీసీ ఇంజన్‌తో అభివృద్ధి చేసిన ఈ సరికొత్త సుజుకి హయాటేను కంపెనీ హైజరాబాద్ మార్కెట్లో విడుదస చేసింది.
స్టయిలిష్ లుక్, అట్రాక్టివ్ బాడీ గ్రాఫిక్స్, పవర్‌ఫుల్ 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్, 4-స్పీడ్ గేర్ బాక్స్ (అన్ని గేర్లు క్రింది వైపుకు), 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లతో ఇది లభిస్తుంది. సుజుకి హయాటే కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని మొత్తం బరువు 112 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు, మైలేజ్ 70 కి.మీ. ఇందులో సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ (షాషీ)కు ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెషన్, వెనుక వైపు 5-వే అడ్జస్టబల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌లను అమర్చారు.
హైదరాబాద్ మార్కెట్లో సుజుకి హయాటే కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.40,271 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గానూ సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.42,271 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గానూ కంపెనీ నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్‌ను అభివృద్ధి చేశామని, ప్రతి నెలా 10,000 యూనిట్లకు పైగా సుజుకి హయాటే మోటార్‌సైకిళ్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని కంపెనీ నేషనల్ హెడ్ (సేల్స్) ఆనంద్ ఠాకూర్ తెలిపారు.
సుజుకి హయాటే మోటార్‌సైకిల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ కల్పించేందుకు ఈ మోడల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను సుజుకి నియమించుకుంది. సుజుకి హయాటే వైట్, గ్రీన్, గ్రే, రెడ్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








