సుజుకి హయాటే 100సీసీ మోటార్‌సైకిల్ ఫీచర్లు

సుజుకి హయాటేలో 112.8సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. 'హయాటే' అనేది జపాన్ పదం, జపనీస్ భాషలో దీని అర్థం "తాజా గాలి" లేదా "వేగమైన గాలి". మంచి మైలేజ్‌తో పాటు స్టయిలిష్ బైక్‌ను కోరుకునే భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని సుజుకి ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం..!
సుజుకి హయాటే 110సీసీ ఫీచర్లు:
* ఇంజన్: 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎస్ఓహెచ్‌సి
* కిక్ స్టార్ట్/ఎలక్ట్రిక్ స్టార్ట్
* ఎయిర్ క్లియరెన్స్ నాన్-ఒవెన్ ఫ్యాబ్రిక్ ఎలిమెంట్
* లూబ్రికేషన్ సిస్టమ్ వెట్ సంప్
* క్లచ్: వెట్ మల్టీ-ప్లేట్ టైప్
* 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
* ఫ్రంట్ సస్పెన్షన్: టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్
* రియర్ సస్పెన్షన్: స్వింగ్-ఆర్మ్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్
* ఫ్రంట్ టైర్: 2.75 ఇంచ్‌లు
* రియర్ టైర్: 3 ఇంచ్‌లు
* ఫ్రంట్ బ్రేక్: డ్రమ్
* రియర్ బ్రేక్: డ్రమ్
* సిడిఐ ఇగ్నిషన్ టైప్
* ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం: 12.0 లీటర్లు
* బరువు: 115 కేజీలు
* మైలేజ్: ప్రతి లీటరు పెట్రోల్‌కు సమారు 60 కి.మీ.
సుజుకి నుండి మార్కెట్లోకి రాబోతున్న ఈ బడ్జెట్ బైక్ ధర దాదాపు రూ.48,000 నుండి రూ. 50,000 మధ్యలో ఉండొచ్చని అంచనా. అంతా బాగానే ఉంది కానీ, సుజుకి హయాటే 110సీసీ మోటార్‌సైకిల్ చూడానికి సుజుకి స్లింగ్‌షాట్ 125సీసీ చిన్న తమ్ముడి (స్మాల్ బ్రదర్)లా అనిపిస్తుంది. ప్రస్తుతం మన మార్కెట్లో సుజుకి స్లింగ్‌షాట్‌కు లభిస్తున్న ఆదరణ అంతంత మాత్రమే, మరి కొనుగోలుదారులు సుజుకి హయాటేను ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








