మార్చిలో మార్కెట్లోకి రానున్న సుజుకి బడ్జెట్ బైక్ 'హయాటే'

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా స్కూటర్ సెగ్మెంట్లో రాణించినంతగా మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో రాణించలేకపోతుంది. అత్యంత పోటీతో కూడుకున్న భారత మోటార్‌సైకిల్ విభాగంలో సజుకి సరైన మోడళ్లు లేకపోవడంతో ఈ విభాగంలో కంపెనీ అమ్మకాలు ఆశించినతగా సాగడం లేదు. సుజుకి తలరాతను మారుస్తుందనుకున్న స్లింగ్‌షాట్ 125 కూడా పెద్దగా సెక్సెస్ కాలేదు.

దీంతో మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో మంచి మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు ఇటీవల జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తమ బడ్జెట్ బైక్‌ "సుజుకి హయాటే"ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి తక్కువ ధరలో ఓ మంచి ద్విచక్ర వాహనాన్ని భారతీయ కొనుగోలుదారులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేసింది.

కాగా.. వచ్చే నెలలో సుజుకి హయాటే 100సీసీ బైక్‌ను వాణిజ్యపరంగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే స్విష్ 125సీసీ స్కూటర్‌ను కంపెనీ వాణిజ్యపరంగా దేశీయ విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుజుకి హయాటే‌లో 112.8సీసీ, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఫోర్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

స్టయిలిష్ బైక్‌ను కోరుకునే యువతను దృష్టిలో ఉంచుకొని సుజుకి ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా మైలేజ్‌లో ఏ మాత్రం తీసిపోకుండా లీటరు పెట్రోల్‌కు సుమారు 60 కి.మీ. మైలేజీనిచ్చే విధంగా కంపెనీ హయాటేను తీర్చిదిద్దింది. హయాటే ఆన్-రోడ్ ధర రూ.48,000-50,000 రేంజ్‌లో ఉండేలా సుజుకి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇదే సెగ్మెంట్లో హోండా నుండి త్వరలో మార్కెట్లోకి రానున్న బడ్జెట్ బైక్ డ్రీమ్ యుగ 110సీసీ బైక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 22, 2012, 16:15 [IST]
English summary
Suzuki Motorcycle India may launch its budget bike Suzuki Hayate in March 2012. Hayate 110cc bike is powered by a 112.8cc four stroke single cylinder carbureted engine. The Hayate, a Japanese word meaning “Fresh Breeze” or “Swift wind”. It offers around 60 kmpl mileage. Here is the Suzuki Hayate Specifications and Features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+