రాష్ట్ర మార్కెట్లో సుజుకి స్విష్ 125 స్కూటర్ ఆవిష్కరణ

Suzuki Swish 125
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవల ముగిసిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త 125సీసీ స్కూటర్ "సుజుకి స్విష్ 125"ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్ రానున్న మార్చి నెల నుండి మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. అయితే, అంతకన్నా ముందుగా ఈ స్కూటర్‌ను కంపెనీ హైదరాబాద్‌లో ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంపిక చేసిన సుజుకి మోటార్‌సైకిల్ షోరూమ్‌లలో స్విష్ 125 స్కూటర్ కోసం ఉచిత టెస్ట్ డ్రైవ్‌లను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే సుజుకి నుండి అత్యంత విజయవంతమైన అయిన 125సీసీ స్కూటర్ "యాక్సెస్ 125" ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే స్విష్ 125ను రూపొందించడం జరిగింది. యాక్సెస్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే స్విష్ 125లో కూడా ఉపయోగించారు.

పెర్ఫామెన్స్‌లో ఇది యాక్సెస్‌తో సమానంగా ఉంటుంది. అయితే స్టయిల్, డిజైన్‌లో యాక్సెస్ కన్నా పది రెట్లు మెరుగ్గా ఉంటుంది. స్టయిల్ కోరుకునే యువతను దృష్టిలో ఉంచుకొని స్విష్ 125ను అభివృద్ధి చేయడం జరిగిందని కంపెనీ వివరించింది. ఆరు లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్, 20 లీటర్ల కెపాసిటీ కలిగిన అండర్ సీట్ స్టోరేజ్, ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో స్విష్ 125 స్కూటర్ లభిస్తుంది.

హైదరాబాద్ మార్కెట్లో దీని ధర రూ.రూ.47,609 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. రాజ్‌భవన్ రోడ్, కూకట్‌ప్లి, ఆర్‌పి రోడ్, బోయినపల్లి, మల్కాజ్‌గిరి, బషీరాబాద్, మలక్‌పేట, ఉప్పల్, టోలీచౌకి ఏరియాల్లో ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ డీలర్ల వద్ద కొత్త స్విష్ 125 స్కూటర్ టెస్ట్ డ్రైవ్‌కు అందుబాటులో ఉంటుందని, రానున్న మార్చి నెల నుండి అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Friday, February 3, 2012, 12:02 [IST]
English summary
Suzuki Motorcycle India Private limited (SMIPL) has introduced its latest 125cc scooter the 'SWISH 125' in Hyderabad with a price tage of Rs. 47,609 (Ex-showroom. The Suzuki Swish 125 is now available for test riders at selected dealerships in Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+