హీరో ప్లెజర్‌ను టెస్ట్ డ్రైవ్ చెయ్యండి, హృతిక్‌తో డేట్‌కు వెళ్లండి

బాలీవుడ్ అందగాడు, కండల వీరుడు, అమ్మాయిల మనస్సును అయస్కాంతంలా ఆకర్షించే నటుడు హృతిక్ రోషన్‌తో డేట్‌కు వెళ్లాలనుంకుటున్నారా..? అయితే, వెంటనే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీకు దగ్గరలో ఉన్న హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) డీలర్‌షిప్ లేదా షోరూమ్ వద్దకు వెళ్లి హీరో ప్లెజర్ స్కూటర్‌ని టెస్ట్ డ్రైవ్ చేయటమే.

హీరో మోటోకార్ప్ అందిస్తున్న లేడీస్ స్పెషల్ స్కూటర్ ప్లెజర్ కోసం కంపెనీ ఓ కొత్త క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 10వ తేదీని 22వ తేదీ వరకూ హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో ప్లెజర్ స్కూటర్‌ని టెస్ట్ డ్రైవ్ చేసిన అమ్మాయిల నుండి లక్కీ డ్రాని తీయటం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన అమ్మాయిలకు ముంబైలో హృతిక్ రోషన్‌తో డేట్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించబడుతుంది. మరికెందుకు ఆలస్యం వెంటనే మీ సమీపంలోని షోరూమ్‌కి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.


ఇక హీరో ప్లెజర్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 102సీసీ ఎయిర్‌-కూల్డ్, ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 5.03 కి.వా. శక్తిని, 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.85 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. వేరియోమ్యాటిక్ డ్రైవ్ (ఆటోమేటిక్) గేర్ బాక్స్ కలిగిన ఈ స్కూటర్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో హైడ్రాలిక్ డ్యాంపర్ సస్పెన్షన్‌ను ఉపయోగించటం వలన ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

హీరో ప్లెజర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు, ఇది లీటరు పెట్రోల్ 50 కి.మీ. వరకూ మైలేజీనిస్తుంది. దీని మొత్తం బరువు 104 కిలోలు మాత్రమే. ఈ స్కూటర్‌లో ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, తక్కువ టర్నింగ్ రేడియస్, సున్నితమైన సస్పెన్షన్, కొత్త మీటర్ కన్సోల్, పంక్చర్లను తట్టుకునే ట్యూబ్స్, ట్రెండీ రియర్ గ్రిప్, మోడరన్ టెయిల్ లైట్, విశాలమైన సీట్, అధిక అండర్-సీట్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలున్నాయి. హీరో ప్లెజర్ స్కూటర్ ధర రూ.40,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, April 16, 2012, 11:40 [IST]
English summary
Hero MotoCorp, India's leading two wheeler manufacturer has launched a unique campaign for its pleasure scooter. People who test drive the Hero Pleasure now stand a chance to meet Hero MotoCorp's brand ambassador and Bollywood star Hrithik Roshan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+