మహీంద్రా డ్యూరో డిజెడ్ 125 స్కూటర్ టెస్ట్ రైడ్ ఛాలెంజ్

ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెంచుకునేందుకు టూవీలర్ కంపెనీలు వినూత్న స్కీమ్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే, దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెంది ద్విచక్ర వాహన విభాగం "మహీంద్రా టూవీలర్స్" అందిస్తున్న లేటెస్ట్ మోడల్ 125 సీసీ గేర్‌లెస్ స్కూటర్ "డ్యూరో డిజెడ్ 125"పై కూడా ఓ విభిన్న స్కీమ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇందులో భాగంగా, కొత్త డ్యూరో డిజెడ్‌ 125 స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కూడా వేరే బ్రాండ్ స్కూటర్‌ను కొనాలని నిర్ణయించుకునే కస్టమర్లకు రూ.500 చెల్లిస్తామంటూ మహీంద్రా టూవీలర్స్ ఛాలెంజ్ చేస్తుంది. "మహీంద్రా డ్యూరో డిజెడ్ 125 టెస్ట్ రైడ్ ఛాలెంజ్" పేరుతో మహీంద్రా టూవీలర్స్ ఈ కొత్త స్కూటర్ కోసం ఓ క్యాంపైన్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ నెలాఖరుతో ఈ క్యాంపైన్ ముగిసిపోనుంది.

అయితే, ఈ క్యాంపైన్ కోసం మహీంద్రా టూవీలర్స్ కొన్ని నియమ నిబంధనలను విధించింది.

ఇక మహీంద్రా డ్యూరో డిజెడ్ 125 స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో శక్తివంతమైన 125సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఈ స్కూటర్ మెరుగైన మైలేజ్‌ను ఇవ్వటమే కాకుండా, సౌకర్యవంతమైన సస్పెన్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. రాత్రివేళ్ల మంచి కాంతినిచ్చే హాలోజన్ బల్బ్‌తో కూడిన వెడల్పాటి హెడ్ లైట్, సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన బ్రేక్ లీవర్ లాక్, వస్తువులను భద్రపరచుకునేందుకు ముందు వైపు స్టోరేజ్ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్షనీయమైన ధరకే మహీంద్రా టూవీలర్స్ ఈ స్కూటర్‌ను అందిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ఈ స్కూటర్ ధర రూ.44,640 (ఎక్స్‌-షోరూమ్)గా ఉంది. ఇది లీటరు పెట్రోల్‍‌కు 53-56 కి.మీ రేంజ్‌లో మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 25, 2012, 16:26 [IST]
English summary
'Test ride Mahindra Duro DZ scooter and get Rs 500 cash,' don't get surprised, this is a bold offer made by Indian automobile manufacturer Mahindra hoping that interested buyers will stick to its scooter once they try it. Interestingly, the auto maker says that they will give the cash price even if the buyers go for any other scooter after trying the Duro DZ.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+