అన్ని వాతావరణాలకు సరిపోయే టూవీలర్ 'క్రాస్‌బౌ'
ఎండైనా, వానైనా.. మంచు వర్షమైనా, ఇసుక తుఫానైనా.. ఎలాంటి వాతావరణమైనా సరే టూవీలర్‌పై చిక్కులు లేకుండా ప్రయాణించడం కోసం ఓ అద్భుతమైన కాన్సెప్ట్ రూపుదిద్దుకుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న కాన్పెప్ట్ టూవీలర్‌ను చూడండి. దీని పేరు 'క్రాస్‌బౌ' (Crossbow). తెలుగులో 'విల్లంబు' అని అర్థం. ఇదొక ప్రత్యేకమైన ఆల్-వెథర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్. అంటే ఇది అన్ని వాతావారణాలకు సరిపోయే ద్విచక్ర వాహనం అన్నమాట. హెల్మెట్ అవసరం లేకుండా ఈ బైక్‌ను నడపొచ్చు.
ఈ క్రాస్‌బౌ మోటార్‌బైక్‌కు ముందు భాగంలో ఉండే విండ్‌షీల్డ్ రైడర్‌కు పూర్తిస్థాయి సేఫ్టీ గార్డ్ మాదిరిగా పనిచేస్తుంది. భారీ వర్షం, తీవ్రమైన ఎండ వంటి వాతావరణాల్లో టూవీలర్‌ను రైడ్ చేయాలనుకున్న ఈ విండ్ షీల్డ్‌ను పూర్తిగా క్రిందకు దించుకోవచ్చు. క్రాస్‌బౌ విండ్ షీల్డ్‌ను అన్ని రైడర్ పొజిషన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. విండ్ షీల్డ్ లోపల ఉండే రైడర్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా దీని ఏరోడైనమిక్స్ ఉంటాయి. ఈ టూవీలర్ ఎలాంటి సపోర్టింగ్ వీల్ సాయం అవసరం లేకుండానే రెండు చక్రాలపై బ్యాలెన్స్‌ను కలిగి ఉంటుంది.
అంటే కాళ్లు క్రింద పెట్టాల్సిన అవసరం లేకుండానే, ఈ బైక్‌ను ఎక్కడైనా నిలుపుకోవచ్చన్నమాట. ఇది బ్యాటరీ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ వాహనం. తక్కువ వేగంలోనూ, ఎక్కువ వేగంలో బైక్‌పై రైడర్‌కు పూర్తిస్థాయి కంట్రోల్ ఉండే విధంగా ఈ క్రాస్‌బౌ వాహనాన్ని తీర్చిదిద్దారు. వర్షం, పొగ మంచు వాతావరణాల్లో రైడ్ చేస్తున్న విండ్ షీల్డ్‌ను క్లియర్ చేసేందుకు వైపర్ కూడా ఉంటుంది. అత్యత్తుమ బ్రేకింగ్ కోసం డబల్ డిస్క్ బ్రేక్స్, అధిక కాంతినిచ్చే ఆధునిక హెడ్‌లైట్స్ వంటివి ఈ బైక్ అధనపు ప్రత్యేకతలు. మరెందుకు ఆలస్యం ఈ క్రాస్‌బౌ మోటార్‌బైక్‌పై ఓ కన్నేయండి...!

క్రాస్‌బౌ - ఆల్-వెథర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్

క్రాస్‌బౌ - ఆల్-వెథర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్

క్రాస్‌బౌ - ఆల్-వెథర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్

క్రాస్‌బౌ - ఆల్-వెథర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్

క్రాస్‌బౌ - ఆల్-వెథర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్

క్రాస్‌బౌ - ఆల్-వెథర్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్



Click it and Unblock the Notifications








