పల్సర్ 200ఎన్ఎస్‌ను అధికారికంగా విడుదల చేసిన బజాజ్

హమ్మయ్య ఎట్టకేలకు బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి విడుదలైపోయింది. నేడు బజాజ్ ఆటో పూనేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఐదుగురు కస్టమర్లకు కొత్త పల్సర్ 200ఎన్ఎస్ తాళం చెవులను అందజేయటం ద్వారా ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది ఆరంభం నుండి పల్సర్ ప్రియులను ఎంతగానో ఊరిస్తున్న కొత్త పల్సర్ 200ఎన్ఎస్ ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ బైక్ అన్ని షోరూమ్‌లలో దశల వారీగా అందుబాటులోకి రానుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.84,096 (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది. ముందుగా వచ్చిన వాళ్లకే ముందు డెలివరీ (ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్) ప్రాతిపదిక డెలివరీలు అందజేస్తామని బజాజ్ ఆటో పేర్కొంది. పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌ విషయానికి వస్తే, ప్రపంచంలోనే ఎక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

Bajaj Pulsar 200NS Photo Gallery:

కొత్త పల్సర్ 200ఎన్ఎస్‌లో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 7, 2012, 18:49 [IST]
English summary
The wait is over. The first Pulsar 200NS hits the road. Keys were handed out to the first 5 customers today at a ceremony in Pune. And the price is Rs. 84,096/- ex showroom Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+