కొత్త పల్సర్ టీజర్ వెబ్‌సైట్‌తో బైక్ లవర్స్‌ను ఊరిస్తున్న బజాజ్

కొత్త 2012 పల్సర్ స్పోర్ట్స్ బైక్‌ను జనవరి 30వ తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తామని బజాజ్ ఆటో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బజాజ్ పల్సర్ వెబ్‌సైట్‌లో కొత్త పల్సర్ కోసం డిజైన్ చేసిన వెబ్‌పేజ్ ద్వారా బజాజ్ ఆటో బైక్ లవర్స్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. మరో రెండు రోజుల్లో మానియా మళ్లీ ప్రారంభం కానుందంటూ... బజాజ్ ఆటో తన మైపల్సర్ వెబ్‌సైట్‌లో కొత్త 2012 పల్సర్ కోసం ఓ టీజర్‌తో కూడిన కౌంట్‌డౌన్‌ను విడుదల చేసింది. మరి కొత్త 2012 పల్సర్‌ను చూసేందుకు మీరు కూడా వెయిట్ చేస్తున్నారా..?


Click it and Unblock the Notifications








