ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంతో పరుగులు పెట్టే బైక్‌లు
కుర్రకారుకు వెర్రిక్కించే విషయాల్లో 'వేగం' (స్పీడ్) కూడా ఒకటి. మెరుపు వేగంతో వెళ్లే కార్లన్నా బైకులన్నా వారికి ఎంతో మక్కువ. అలాంటి వేగ ప్రియుల కోసమే ఈ కథనం. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంతో పరుగులు పెట్లో టాప్ 10 మోటార్‌సైకిళ్లలో దాదాపు జపనీస్, యూరోపియన్ బ్రాండ్లే అధికంగా ఉన్నాయి. ఇందులో కొన్నింటిన మనం ఇండియాలో కూడా చూస్తుంటాం.
సుజుకి, హోండా, కవాసకి యమహా వంటి జపనీస్ కంపెనీలు, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, ఎమ్‌వీ అగస్టా, డ్యుకాటి వంటి యూరోపియని కంపెనీలు సూపర్‌బైక్‌లను అందిస్తున్నాయి. మరి ఈ సూపర్ బైక్‌లు ఏంటో, వాటి సూపర్ స్పీడ్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..!

టాప్-10 ఫాస్టెట్స్ బైక్స్
కుర్రకారుకు వెర్రిక్కించే విషయాల్లో 'వేగం' (స్పీడ్) కూడా ఒకటి. మెరుపు వేగంతో వెళ్లే కార్లన్నా బైకులన్నా వారికి ఎంతో మక్కువ. అలాంటి వేగ ప్రియుల కోసమే ఈ కథనం. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంతో పరుగులు పెట్లో టాప్ 10 మోటార్‌సైకిళ్లలో దాదాపు జపనీస్, యూరోపియన్ బ్రాండ్లే అధికంగా ఉన్నాయి. మరి ఈ సూపర్ బైక్‌లు ఏంటో, వాటి సూపర్ స్పీడ్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..!

10. సుజుకి జిఎస్ఎక్స్ - ఆర్1000
సుజుకి జిఎస్ఎక్స్ - ఆర్1000 బైక్ నుంచి మనం టాప్-10 ఫాస్టెస్ట్ బైక్‌ల లిస్ట్‌ను ప్రారంభిద్దాం. జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి అందిస్తున్న ఈ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

9. హోండా సిబిఆర్ 1000 ఆర్ఆర్
టాప్-10 ఫాస్టెస్ట్ బైక్‌ల లిస్ట్‌లో 9వ స్థానంలో ఉన్న సూపర్‌బైక్ హోండా సిబిఆర్ 1000. జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా అందిస్తున్న సిబిఆర్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని సంపాధించుకుంది. ఈ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 291 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

8. యమహా ఆర్1
మరొక జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా అందిస్తున్న సూపర్‌బైక్ యమహా ఆర్1. ఈ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 297 కిలోమీటర్లు. మన టాలీవుడ్‌లో నాగచైతన్య వద్ద కూడా ఇలాంటి ఓ సూపర్‌బైక్ ఉంది.

7. కవాసకి నిన్జా జెడ్‌జెడ్ఆర్ 1400
జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి అందిస్తున్న కవాసకి నిన్జా జెడ్‌జెడ్ఆర్ 1400 సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 299 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఇది అత్యంత శక్తివంతమైన 1400సీసీ ఇంజన్‌తో లభిస్తుంది.

6. డ్యుకాటి 1199 పనిగేల్ సూపర్‌బైక్
ఇటాలియన్ టూవీలర్ కంపెనీ డ్యుకాటి అందిస్తున్న సూపర్‌బైక్‌లలో కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన డ్యుకాటి 1199 పనిగేల్ సూపర్‌బైక్ అతి తక్కువ సమయంలో అత్యంత ప్రాచుర్యాన్ని సొంతం చేసుకుంది. ఈ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

5. బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన టూవీలర్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అందిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 305 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఇది ఏబిఎస్, ఎలక్ట్రానికి ఎవల్యూషన్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో లభ్యమవుతుంది.

4. ఎమ్‌వి అగస్టా ఎఫ్3 టాంబురిని
యూరోపిన్ టూవీలర్ బ్రాండ్ ఎమ్‌వి అగస్టా అందిస్తున్న సూపర్‌బైక్‌లలో ఎఫ్3 టాంబురిని పాపులర్ మోడల్. ఎమ్‌వి అగస్టా ఎఫ్3 టాంబురిని గరిష్టంగా గంటకు 307 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

3. ఎమ్‌వి అగస్టా ఎఫ్4 ఆర్312
ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్న సూపర్‌బైక్ ఎమ్‌వి అగస్టా ఎఫ్4 ఆర్312. ఇది గరిష్టంగా గంటకు 314 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

2. సుజుకి హయబుసా
జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి అందిస్తున్న పాపులర్ సూపర్‌బైక్‌లలో హయబుసా ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పవచ్చు. ప్రముఖ సెలబ్రిటీలు ఉపయోగించే సుజుకి హయబుసా సూపర్‌బైక్ గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు.

1. ఎమ్‌టిటి టర్బైన్ సూపర్‌బైక్ వై2కె
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సూపర్‌బైక్ ఎమ్‌టిటి టర్బైన్ వై2కె. ఇందులో సాధారణ ఇంజన్లకు బదులు రోల్స్ రాయిస్ హెలికాఫ్టర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 300 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తూ, గరిష్టంగా గంటకు 370 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.


Click it and Unblock the Notifications








