మీ ప్రయాణాన్ని సుఖవంతం, సురక్షితం చేసే కార్ యాక్ససరీస్

కొత్త కార్లలో కంపెనీలు అందించే యాక్ససరీలు పరిమితంగా ఉంటాయి. మీ కారులో మరింత అదనపు సౌకర్యాలను పొందాలంటే బయటి మార్కెట్లో లభించే యాక్ససరీలను ఉపయోగించాల్సిందే. మరి కారులో ఉండాల్సిన ఇలాంటి టాప్ 5 యాక్ససరీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇవి మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడమే కాకుండా, సురక్షితం కూడా చేస్తాయి.

రియర్ వ్యూ కెమెరా, ఎల్‌సిడి స్క్రీన్:
టాప్ ఎండ్ వేరియంట్ కార్లలో రియర్ వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్, పార్కింగ్ అసిస్టెంట్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తుంటాయి. అయితే, సాధారణ ఎంట్రీ లెవల్ కార్లలో ఈ ఫీచర్లు అందుబాటులో ఉండవు. అయినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల పార్కింగ్ అసిస్టెంట్ సిస్టమ్‌లు, జిపిఎస్ ట్రాకర్‌లు వంటివి లభిస్తున్నాయి. వీటిని టాటా నానో మొదలుకొని టాప్ ఎండ్ వేరియంట్ కార్ల వరకూ అమర్చుకోవచ్చు.

రియర్ వ్యూ కెమెరా సాయంతో మీ వెనుక వైపు వచ్చే వాహనాలను గమనించడమే కాకుండా, పార్కింగ్ సమయాల్లో, అలాగే రాత్రివేళ ప్రయాణాల్లో ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. అంతే కాకుండా, వీటి సాయంతో మ్యూజిక్, వీడియోలు వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటుగా జిపిఎస్ వంటి ఫీచర్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో రియర్ వ్యూ కెమెరాలు రూ.6,000 నుంచి ప్రారంభమవుతాయి.

కార్ రోలర్ సన్ షేడ్:
ప్రస్తుతం కార్లకు టింటెడ్ గ్లాస్‌లను ఉపయోగించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో కారులో ప్రయాణించాలంటే చిరాకుగా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే కాంతి నేరుగా కారు లోపలికి ప్రవేశించిన ఏసి ఆన్ చేసినా పెద్ద ఫలితాన్ని కనబరచదు. కాబట్టి, ఈ సమస్యను అధిగమించేందుకు కార్ రోలర్ సన్ షేడ్‌లను ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించడం చట్టానికి విరుద్ధం కాదు. ఇవి సింపుల్‌గా కర్టెన్ల మాదిరిగా ఉండి, కారు లోపలికి సూర్యకిరణాలు ప్రసరించడాన్ని అడ్డుకుంటాయి. మార్కెట్లో ఇవి రూ.300 నుంచి లభిస్తాయి.

యాంటీ-స్లిప్ డ్యాష్ బోర్డ్ మ్యాట్:
కారు గమనంలో ఆ వేగానికి డ్యాష్ బోర్డ్‌పై ఉంచిన వస్తువులు (మొబైల్, తాళం చెవులు ఇతర వస్తువులు) క్రింద పడిపోవటం జరుగుతుంటుంది. అయితే, యాంటీ-స్లిప్ డ్యాష్ బోర్డ్ మ్యాట్‌ను ఉపయోగించడం వలన ఈ సమస్యను అరికట్టవచ్చు. ఇది డ్యాష్ బోర్డ్ మాదిరి నునుపుగా ఉండకుండా, దీనిపై ఉంచిన వస్తువులను జారిపోకుండా ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది. మార్కెట్లో ఇవి రూ.200 నుంచి లభిస్తాయి.

కార్ కంఫర్ట్ కిట్ - బీజ్:
మీ కారులో ఈ కార్ కంఫర్ట్ కిట్‌ను ఉపయోగించడం వలన మీ కారుకు ఓ కొత్త లుక్ అండ్ ఫీల్ రావటమే కాకుండా, కారు నడిపే వారికి అందులో కూర్చున్న వారికి సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తాయి. మీ కారు ఇంటీరియర్ కలర్‌కు తగినట్లుగా ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ కిట్‌లో రెండు నెక్ రెస్ట్స్, రెండు పిల్లోస్, ఒక టిష్యూ హోల్డర్ ఉంటుంది. మార్కెట్లో ఇవి రూ.1,000 నుంచి లభిస్తాయి.

కార్ పెర్ఫ్యూమ్:
కారులో దుర్వాసన రాకుండా ఉండాలంటే, కారు లోపలి వైపు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం తప్పనిసరి. అలాగే, కారులో ప్రయాణిస్తున్నప్పుడు మంచి సువాసన వచ్చేలా సెంట్‌లను ఉపయోగించుకుంటే మనసుకు మరింత హాయిగా అనిపిస్తుంది. మార్కెట్లో మంచి సువాసన కలిగిన పెర్ఫ్యూమ్‌లు రూ.300 నుంచి లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 6, 2012, 13:06 [IST]
English summary
Car accessories are extra features that you fit in your car to make your rides easy and comfortable. Here we are talking about some of the must have car accessories to make your journeys an unforgettable experience.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+