భారత్‌లో అమ్మాయిల కోసం టాప్-5 స్కూటర్స్: వివరాలు

By Ravi

ప్రస్తుతం దేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. ఇందులో స్కూటర్ సెగ్మెంట్ మరియు ద్విచక్ర వాహనాలను నడిపే మహిళలు కూడా అధికమవుతున్న సంగతి తెలిసిందే. వీరిని దృష్టిలో ఉంచుకొని ద్విచక్ర వాహన తయారీదారులు ఆఫర్ చేస్తున్న స్కూటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. స్కూటర్ సెగ్మెంట్లో, హీరో మోటోకార్ప్, సుజుకి, హోండా, టీవీఎస్, యమహా తదితర కంపెనీలు స్కూటర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో అమ్మాయిలకు సూట్ అయ్యే మోడళ్లను ఎంచుకోవటం ఎలా..?

ఇలా ఆలోచించే వారి కోసమే ఈ కథనం. తమ రోజూవారీ ప్రయాణంలో సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడ్‌ను కోరుకుంటూ, ది బెస్ట్ స్కూటర్‌ను ఎంచుకోవాలనుకునే వారి కోసం ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్లలో కాలేజ్ అమ్మాయిలకు సూట్ అయ్యే టాప్ 5 బైక్‌లను ఈ కథనంలో తెలుసుకుందాం..!

భారత్‌లో అమ్మాయిల కోసం టాప్-5 స్కూటర్స్

భారత్‌లో అమ్మాయిల కోసం టాప్-5 స్కూటర్స్

తమ రోజూవారీ ప్రయాణంలో సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడ్‌ను కోరుకుంటూ, ది బెస్ట్ స్కూటర్‌ను ఎంచుకోవాలనుకునే వారి కోసం ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్లలో కాలేజ్ అమ్మాయిలకు సూట్ అయ్యే టాప్ 5 బైక్‌లను ఈ కథనంలో తెలుసుకుందాం..!

హోండా డియో

హోండా డియో

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న "డియో" స్కూటర్ స్టయిలిష్ రైడ్ కోరుకునే యువతరం అమ్మాయిలకు చక్కగా సరిపోతుంది. హోండా ఇటీవలే తమ డియో స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసి మరింత స్టయిలిష్‌గా తీర్చిదిద్దింది. ఇది ఇటు పెర్ఫామెన్స్‌లోను అటు హ్యాండ్లింగ్‌లోను ది బెస్ట్‌గా ఉంటుంది. హోండా డియోలో ఉపయోగించిన 110సీసీ ఇంజన్ 8 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది (హోండా ఆక్టివాలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు).

యమహా రే

యమహా రే

మరొక జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్ భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకొని మార్కెట్లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి స్కూటర్ యమహా రే. మెరుగైన యాక్సిలరేషన్, సులువైన హ్యాండ్లింగ్, ఉత్తమమైన రైడ్ కంట్రోల్ వంటి విశిష్టలు యమహా రే స్కూటర్ ప్రత్యేకం. సరికొత్త డిజైన్, స్టయిలిష్ లుక్, ఆకట్టుకునే మైలేజ్, సరసమైన ధర వంటి ఫీచర్లతో ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని యమహా ఇండియా ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. యమహా రేలో శక్తివంతమైన 113సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7 హెచ్‌పిల శక్తిని, 8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు పెట్రోల్‌కు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది.

టీవీఎస్ స్కూటీ పెప్+

టీవీఎస్ స్కూటీ పెప్+

స్కూటర్ సెగ్మెంట్లో ఎన్ని స్కూటర్ల వచ్చినప్పటికీ, అమ్మాయిల ఆల్‌టైమ్ ఫేవరేట్ స్కూటర్ మాత్రం టీవీఎస్ స్కూటీ అనే చెప్పాలి. టీవీఎస్ అందిస్తున్న స్కూటీ పెప్+ స్కూటర్ నేటి తరం అమ్మాయిలకి ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. టీవీఎస్ స్కూటీ పెప్+ స్కూటర్‌లో 87.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3.68 కి.వా. శక్తిని, 5.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ స్కూటీ స్ట్రీక్

టీవీఎస్ స్కూటీ స్ట్రీక్

టీవీఎస్ స్కూటీలో మరింత స్టయిలిష్ వెర్షన్ కోరుకునే యువతుల కోసం కంపెనీ ఇందులో స్ట్రీక్ అనే వేరియంట్‌ను అందిస్తుంది. స్కూటీ పెప్+ తో పోల్చుకుంటే టీవీఎస్ స్కూటీ స్ట్రీక్ ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌, స్టయిలిష్ డిజైన్‌ను కలిగి ఉండి నేటి తరం అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకుంటుంది. టీవీఎస్ స్కూటీ పెప్+ స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. ఇందులో అమర్టిన 87.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ గరిష్టంగా 3.68 కి.వా. శక్తిని, 5.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఫ్లయిట్

మహీంద్రా ఫ్లయిట్

కైనటెక్‌ను మహీంద్రా స్వాధీనం చేసుకున్న తర్వాత, కైనెటిక్ ఉత్పత్తుల్లో కాస్తంత మార్పులు చేర్పులు చేసి వాటిని మార్కెట్లోకి రీలాంచ్ చేయటం జరిగింది. మహీంద్రా అందిస్తున్న నాలుగు స్కూటర్లలో మహీంద్రా ఫ్లయిట్ సన్నటి డిజైన్‌ను, శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. తేలికపాటి స్కూటర్లను కోరుకునే అమ్మాయిలకి ఇది కూడా ఒక చక్కని ఆప్షన్‌గా ఉంటుంది. మహీంద్రా ఫ్లయిట్ స్కూటర్‌లో 124.6సీసీ, 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా డియో:
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న "డియో" స్కూటర్ స్టయిలిష్ రైడ్ కోరుకునే యువతరం అమ్మాయిలకు చక్కగా సరిపోతుంది. హోండా ఇటీవలే తమ డియో స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసి మరింత స్టయిలిష్‌గా తీర్చిదిద్దింది. ఇది ఇటు పెర్ఫామెన్స్‌లోను అటు హ్యాండ్లింగ్‌లోను ది బెస్ట్‌గా ఉంటుంది. హోండా డియోలో ఉపయోగించిన 110సీసీ ఇంజన్ 8 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది (హోండా ఆక్టివాలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు).

యమహా రే:
మరొక జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్ భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకొని మార్కెట్లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి స్కూటర్ యమహా రే. మెరుగైన యాక్సిలరేషన్, సులువైన హ్యాండ్లింగ్, ఉత్తమమైన రైడ్ కంట్రోల్ వంటి విశిష్టలు యమహా రే స్కూటర్ ప్రత్యేకం. సరికొత్త డిజైన్, స్టయిలిష్ లుక్, ఆకట్టుకునే మైలేజ్, సరసమైన ధర వంటి ఫీచర్లతో ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని యమహా ఇండియా ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. యమహా రేలో శక్తివంతమైన 113సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7 హెచ్‌పిల శక్తిని, 8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు పెట్రోల్‌కు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది.

టీవీఎస్ స్కూటీ పెప్+:
స్కూటర్ సెగ్మెంట్లో ఎన్ని స్కూటర్ల వచ్చినప్పటికీ, అమ్మాయిల ఆల్‌టైమ్ ఫేవరేట్ స్కూటర్ మాత్రం టీవీఎస్ స్కూటీ అనే చెప్పాలి. టీవీఎస్ అందిస్తున్న స్కూటీ పెప్+ స్కూటర్ నేటి తరం అమ్మాయిలకి ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. టీవీఎస్ స్కూటీ పెప్+ స్కూటర్‌లో 87.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3.68 కి.వా. శక్తిని, 5.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ స్కూటీ స్ట్రీక్:
టీవీఎస్ స్కూటీలో మరింత స్టయిలిష్ వెర్షన్ కోరుకునే యువతుల కోసం కంపెనీ ఇందులో స్ట్రీక్ అనే వేరియంట్‌ను అందిస్తుంది. స్కూటీ పెప్+ తో పోల్చుకుంటే టీవీఎస్ స్కూటీ స్ట్రీక్ ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌, స్టయిలిష్ డిజైన్‌ను కలిగి ఉండి నేటి తరం అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకుంటుంది. టీవీఎస్ స్కూటీ పెప్+ స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. ఇందులో అమర్టిన 87.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ గరిష్టంగా 3.68 కి.వా. శక్తిని, 5.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఫ్లయిట్:
కైనటెక్‌ను మహీంద్రా స్వాధీనం చేసుకున్న తర్వాత, కైనెటిక్ ఉత్పత్తుల్లో కాస్తంత మార్పులు చేర్పులు చేసి వాటిని మార్కెట్లోకి రీలాంచ్ చేయటం జరిగింది. మహీంద్రా అందిస్తున్న నాలుగు స్కూటర్లలో మహీంద్రా ఫ్లయిట్ సన్నటి డిజైన్‌ను, శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. తేలికపాటి స్కూటర్లను కోరుకునే అమ్మాయిలకి ఇది కూడా ఒక చక్కని ఆప్షన్‌గా ఉంటుంది. మహీంద్రా ఫ్లయిట్ స్కూటర్‌లో 124.6సీసీ, 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 20, 2012, 14:40 [IST]
English summary
The Indian two wheeler market has grown to its current level not just because of motorcycles but also due to scooters. Scooters are the favourite means of transport for young college going kids particularly among girls. The number of women riding two wheelers increased heavily only after scooters were launched. The scooter is an ideal vehicle for women to drive as it offers a comfortable seating position and is easy to drive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+