ఫిబ్రవరి నెలలో టాప్ 6 టూవీల్ కంపెనీలు ఇవే..!!

ఫిబ్రవరి నెలలో కూడా ద్విచక్ర వాహనాల జోరు కొనసాగింది. ఫిబ్రవరి నెలలో టాప్ 6 టూవీలర్ కంపెనీల అమ్మకాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

1. హీరో మోటోకార్ప్:
దేశపు అగ్రగామి ద్విచక్ర-వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన ఫిబ్రవరి నెల అమ్మకాలలో 10.89 శాతం వృద్ధిని సాధించి మరోసారి ఐదు లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసుకుంది. ఫిబ్రవరి 2011లో 4,72,055 యూనిట్లను విక్రయించిన హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి 2012లో 5,23,465 యూనిట్లకను విక్రయించింది.

2. బజాజ్ ఆటో:
ద్విచక్ర వాహన అమ్మకాల్లో ద్వితీయ స్థానంలో ఉన్న బజాజ్ ఆటో లిమిటెడ్ గడచిన నెల అమ్మకాల్లో 5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఫిబ్రవరి 2012లో కంపెనీ మొత్తం 3,01,961 యూనిట్లకు విక్రయించిది. కంపెనీ చరిత్రలో అత్యధిక అమ్మకాలు సాధించిన నెల ఇదేనని బజాజ్ ఆటో తెలిపింది. గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2,86,657 యూనిట్లుగా ఉన్నాయి.

3. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్:

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో నెంబర్ వన్ స్థానంపై కన్నేసిన హోండా గడచిన ఫిబ్రవరి నెల అమ్మకాల్లో ఏకంగా 41.30 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఫిబ్రవరి 2012లో హోండా మొత్తం 2,06,043 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేది ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు కేవలం 1,45,819 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయని హోండా పేర్కొంది.

4. టీవీఎస్ మోటార్ కంపెనీ:

దేశపు ద్విచక్ర వాహన మార్కెట్లో తృతీయ స్థానంలో ఉండాల్సిన టీవీఎస్‌ను హోండా ఓవర్‌టేక్ చేసిన సంగతి తెలిసిందే. గడచిన ఫిబ్రవరి నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ కేవలం 1,72,061 యూనిట్లను మాత్రమే విక్రయించి మొత్తం వృద్ధిలో 3.02 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. గడచిన సంవత్సరం ఇదే సమయంలో మొత్తం 1,77,412 యూనిట్లను విక్రయించామని కంపెనీ పేర్కొంది.

5. ఇండియా యమహా మోటార్:
ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్న ఇండియా యమహా మోటార్ గడచిన ఫిబ్రవరి నెల అమ్మకాలలో 23.03 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఈ సమయంలో కంపెనీ మొత్తం 40,655 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో యమహా మొత్తం 33,046 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

6. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా:
ఇకపోతే చివరిగా.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఫిబ్రవరి నెల అమ్మకాల్లో 29.85 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఈ నెలలో మొత్తం 37,336 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించామని హోండా తెలిపింది. గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో కంపెనీ అమ్మకాలు 28,754 యూనిట్లుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 3, 2012, 16:13 [IST]
English summary
Two-wheeler sales zoomed in February 2012. The country's largest two-wheeler maker Hero MotoCorp sold 5,23,465 units, Bajaj Auto sold 3,01,961 units, Honda Motorcycle & Scooter India sold 2,06,043 units, TVS Motor Company sold 1,72,061 units, India Yamaha Motor sold 40,655 units, Suzuki Motorcycle India sold 37,336 units in Feb 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+