జూన్ బైక్ సేల్స్: ఎవరికి లాస్..? ఎవరికి ప్రాఫిట్..?

పెట్రోల్ ధరలు పెరిగాయా...? అయినా వుయ్ డోంట్ కేర్ అనేస్తన్నారు బైకర్లు.. దీంతో దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరు ఎప్పటి మాదిరిగానే కొనసాగుతుంది. ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే పోల్చుకుంటే, పెట్రోల్‌తో నడిచే బైక్‌లే ఎక్కువగా మైలేజీనిస్తుండటంతో కొనుగోలుదారులు కారు కన్నా ఎక్కువ బైక్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. గడచిన జూన్ నెలలో కూడా ద్విచక్ర వాహన అమ్మకాలు ప్రోత్సాహకరంగానే సాగాయి.

1. హీరో మోటోకార్ప్:
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ జూన్ 2012లో 5,34,091 యూనిట్లను విక్రయించి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 4.26 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్ 2011లో కంపెనీ మొత్తం 5,12,244 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కాగా.. హీరో మోటోకార్ప్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త మ్యాస్ట్రో స్కూటర్, ఇగ్నైటర్ బైక్‌లు ఎలాంటి మ్యాజిక్‌ను చేయనున్నాయో త్వరలోనే తేలనుంది.

2. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్:
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా జూన్ 2012 నెలలో అద్భుతమైన అమ్మకాలను కనబరిచింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 2,26,864 యూనిట్లుగా నమోదయ్యి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 52.32 శాతం వృద్ధిని కనబరిచింది. జూన్ 2011లో కంపెనీ మొత్తం 1,48,937 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

3. యమహా మోటార్స్
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ కూడా జూన్ 2012లో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అందిస్తున్న తాజా స్పోర్ట్స్ బైక్ యమహా ఆర్15 వెర్షన్ 2.0, ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లు డిమాండ్ పెరగడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో కంపెనీ మొత్తం 228,378 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించి, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 9.6 శాతం వృద్ధిని కనబరిచింది.

4. బజాజ్ ఆటో:
దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటోకు మాత్రం జూన్ 2012 పెద్దగా కలిసిరాలేదని చెప్పవచ్చు. ఈ సమయంలో కంపెనీ మొత్తం 318,377 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 1.38 శాతం తగ్గుదలను నమోదు చేసింది. జూన్ 2011లో బజాజ్ ఆటో మొత్తం 322,827 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

5. టీవీఎస్ మోటార్ కంపెనీ:
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న దేశీయ టూవీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్‌సైకిల్స్ కూడా జూన్ 2012 నెల అమ్మకాల్లో తగ్గుదలను కనబరిచింది. కొత్త టీవీఎస్ అపాచీ విడుదలైనప్పటికీ మార్కెట్లో అమ్మకాల జోరు మాత్రం పెరగలేదు. జూన్ 2012లో టీవీఎస్ మొత్తం 165,438 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. జూన్ 2011లో కంపెనీ మొత్తం 178,633 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయిచింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 5, 2012, 15:24 [IST]
English summary
Despite of market slow down and high petrol prices, two wheelers sales in June 2012 showed good results. Top companies like Hero MotoCorp, Honda Motorcycles and Scooters India, India Yamaha Motor were benifited in June 2012 sales. Here is the detailed report.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+