మాన్‌సూన్ సీజన్ కోసం టొయోటా స్పెషల్ సర్వీస్ క్యాంప్
టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) తమ కస్టమర్ల కోసం ఓ సరికొత్త సర్వీస్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. 'వాకు డోకి క్యూ సిరీస్ క్యాంపైన్' పేరుతో జులై 16న ప్రారంభమైన ఈ సర్వీస్ క్యాంపైన్ సెప్టెంబర్ 15, 2012 వరకూ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న టొయోటా డీలర్‌షిప్‌లు, అధీకృత సర్వీస్ సెంటర్లలో కస్టమర్లు తమ టొయోటా కార్లకు ఫ్రీ చెకప్ సౌకర్యాన్ని, కస్టమ్ ఆఫర్లను పొందవచ్చు..
ఈ సర్వీస్ క్యాంపైన్‌లో కంపెనీ అందిస్తున్న విశిష్టమైన సౌకర్యాలు ఇలా ఉన్నాయి.
* మాన్‌సూన్ సీజన్ కోసం 20-పాయింట్ ఉచిత వెహికల్ చెకప్.
* సర్వీస్‌పార్ట్ ప్యాకేజ్‌లతో పాటుగా కార్ కేర్ సొల్యూషన్‌పై 25 శాతం తగ్గింపు.
* ఇన్సూరెన్స్ రెన్యువల్‌తో ఉచిత వెహికల్ ఎన్‌రిచ్‌మెంట్.
* బాడీ, పెయింట్ సర్వీసులపై లేబర్ చార్జీలో 15 శాతం తగ్గింపు.
* టొయోటా విడిభాగాలపై 20 శాతం తగ్గింపు.
* స్నేహితుడిని రెఫర్ చేయడంపై ఓ ప్రత్యమైన ఆఫర్‌లను కంపెనీ అందిస్తోంది.
ఈ సర్వీస్ క్యాంపైన్ ద్వారా, వినియోగదారులకు తమ టొయోటా కార్లకు కావల్సిన అన్న అవసరాలు ఒకే ప్రాంతంలో కల్పించేందుకు అవకాశం ఏర్పడిందని, వర్షాకాలంలో వాహనాలను పూర్తి కండిషన్‌లో ఉంచుకొని, కస్టమర్లు ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) సందీప్ సింగ్ వివరించారు. ప్రస్తుతం తాము అందిస్తున్న వివిధ ప్యాకేజ్‌లు, స్కీమ్‌ల ద్వారా కస్టమర్లు ప్రయోజనాలు పొంది, ఈ సీజన్‌లో లాంగ్ జర్నీలకు తమ వాహనాలను సిద్ధంగా ఉంచుకునేందుకు ఈ సర్వీస్ క్యాంపైన్ సహకరిస్తుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications









