ఇండియాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న ట్రైయంప్

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ట్రైయంప్ భారత మార్కెట్లో అందిస్తున్న ద్విచక్ర వాహనాల ధరలు త్వరలోనే దిగిరానున్నాయి. మరో రెండేళ్లలో ఈ ప్రీమియం మోటార్‌సైకిళ్లు అందుబాటు ధరలకే లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రైయంప్, ఇక్కడి మార్కెట్లో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని పార్రంభించాలని యోచిస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రైయంప్ సన్నాహాలు చేస్తుంది. బెంగుళూరుకు సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న నర్సాపూర్ ప్రాంతంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సుమారు 30 ఏకరాల విస్తీర్ణంలో అత్యాధనిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ కేంద్రాన్ని ట్రైయంప్ ఏర్పాటు చేయనుంది.


ఈ కొత్త ప్లాంట్ కోసం కంపెనీ సుమారు 850 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ ప్లాంటును ప్రారంభంలో భాగంగా సాలీనా 2,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన మోటార్‌సైకిళ్లను సమీప దేశాలకు ట్రైయంప్ ఇండియా ఎగమతి చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ట్రైయంప్ భారత మార్కెట్లో అందిస్తున్న మోటార్‌సైకిళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా మన మార్కెట్లో వీటి ధరలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే, వీటిని తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి తీసుకురావలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తి చేయడం వలన ఇవి తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 26, 2012, 16:22 [IST]
English summary
Triumph Motorcycles, the iconic British motorcycle brand, is setting up a factory in India. The company has chosen Karnataka as their primary location for the manufacturing plant. Triumph motorcycles are much awaited in India and with the factory being set-up at Narasapur, about 52 kms from Bangalore, surely will bring joy to all Triumph Motorcycle lovers. Do you love Triumph Motorcycles?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+