కర్ణాటకలో ప్లాంటు ఏర్పాటుకు ట్రైయంప్ సన్నాహాలు

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ కంపెనీ ట్రైయంప్ కర్ణాటకపై కన్నేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఓ అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. బహుశా మరో ఏడాది లోపుగా దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం కంపెనీ ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలతో చర్చలు కూడా జరిపింది.

ప్రస్తుతానికి ట్రైయంప్‌కు యూకె, థాయ్‌లాండ్‌లలో మాత్రమే అసెంబ్లింగ్ కేంద్రాలున్నాయి. తాజాగా భారత్‌లో ఏర్పాటు చేయనున్నది కంపెనీకు ప్రపంచ వ్యాప్తంగా మూడవ అసెంబ్లింగ్ యూనిట్ కానుంది. దీని ద్వారా ప్రపంచపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్ అయిన భారత్‌లో అత్యంత పోటీ ధరకే ఉత్పత్తులను అందించేందుకు ట్రైయంప్‌కు చక్కటి అవకాశం ఏర్పడనుంది.

ట్రైయంప్ పోటీదారు అయిన అమెరికాకు చెందిన ప్రీమియం ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ గడచిన సంవత్సరంలో హర్యానాలో ఈ తరహా అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ట్రైయంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకోవటం గమనార్హం. కర్ణాటకలోని కోలార్ వద్ద జపాన్ ఆటోదిగ్గజం హోండా నిర్మిస్తున్న ప్లాంటుకు సమీపంలో ట్రైయంప్ కూడా 40 స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ట్రైయంప్ భారత మార్కెట్లో అందిస్తున్న అన్ని మోడళ్లు కూడా సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది. ఈ మోడళ్లను భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేసినట్లయితే, ఇవి కాస్తంత తక్కువ ధరకు లభించే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 15, 2012, 15:54 [IST]
English summary
Triumph, the iconic British premium bike manufacturer is said to be planning to build its first Indian plant in Karnataka. The company has reportedly held talks with the government of Karnataka and has been offered 40 acres of land.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+