ఫినిక్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్
గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది. టీవీఎస్‌కు 125సీసీ బైక్ సెగ్మెంట్లో సరైన ఉత్పత్తి లేదు. ప్రస్తుతం టీవీఎస్ ఈ సెగ్మెంట్లో 'ఫ్లేమ్'ను ఆఫర్ చేస్తున్నప్పటికీ మార్కెట్లో ఈ మోడల్‌కు పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో హోండా షైన్ 125, హీరో గ్లామర్ 125, బజాజ్ ప్లాటినా 125 వంటి మోడళ్లను సవాల్ చేసేలా ఈ సరికొత్త ఫినిక్స్ 125సీసీ బైక్‌ను టీవీఎస్ రూపొందించింది.
టీవీఎస్ ఫినిక్స్ ధర టీవీఎస్ ఫ్లేమ్ ధర కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. టీవీఎస్ ఫ్లేమ్ ధరలు రూ.46,000 నుంచి రూ.48,000 రేంజ్‌లో ఉన్నాయి. ఈ 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10.5 బిహెచ్‌పిల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. టీవీఎస్ నుంచి పవర్, పెర్ఫామెన్స్, మైలేజ్, బడ్జెట్‌తో కూడిన బైక్‌ను కోరుకునే వారికి టీవీఎస్ ఫినిక్స్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలువనుంది.
ఇదిలా ఉండగా, టీవీఎస్ మరొక కొత్త స్కూటర్‌ను, అలాగే ఓ పవర్‌ఫుల్ అపాచీని విడుదల చేయాలని కూడా యోచిస్తోంది. అంతేకాకుండా, గత ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన హైబ్రిడ్ స్కూటర్ క్యూబ్‌ని కూడా టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ టెస్ట్ రన్ విజయవంతం అయితే, వాణిజ్యపరంగా క్యూబ్ హైబ్రిడ్ స్కూటర్లు ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో అధిక మైలేజీనిచ్చే క్యూబ్ వంటి స్కూటర్లను మార్కెట్లోకి వీలైనంత త్వరగా తీసుకు రావాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications









