కొత్త 2012 స్టార్ సిటీ: లీటరుకు 84 కి.మీ. మైలేజ్!!

కొత్త 2012 స్టార్ సిటీ మోటార్‌సైకిల్‌లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు. ఇది సరికొత్త ఆకర్షనీయమైన, రంగులలో లభ్యమవుతుంది. ప్రస్తుతం 2012 స్టార్ సిటీ బైక్ డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయిక)తో పెయింట్ ఫినిష్‌తో, ఆరు రంగుల్లో లభిస్తుంది. ఇక ఎక్స్టీరియర్స్ విషయానికి ఇది సరికొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. స్టార్ సిటీ ఐదేళ్ల వారంటీతో లభిస్తుంది.
అంతేకాకుండా ఇది స్పష్టమై లెన్స్ టర్న్ ఇండికేటర్లను కూడా కలిగి ఉంటుంది. కొత్త 2012 స్టార్ సిటీ బైక్ లీటరు పెట్రోల్‌కు 83.9 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. అత్యంత పోటీ ధరకే కంపెనీ ఈ బైక్‌ను అందిస్తుంది. కొత్త 2012 స్టార్ సిటీ బైర్ ధర రూ.38,540 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. రానున్న రోజుల్లో విడుదల కానున్న హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో, హోండా డ్రీమ్ యుగ, సుజుకి హయాటే బైక్‌లకు ఇది పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








