టీవీఎస్ ఫినిక్స్ 125 రైడ్ ప్రీమియం క్లాస్ - సమీక్ష

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన 125సీసీ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ 'ఫినిక్స్'ను బడ్జెట్‌ ధరకే ఎగ్జిక్యూటివ్ రైడ్ కోరుకునే వారికి చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. సాధారణంగా టీవీఎస్ మోటార్‌సైకిళ్లు మైలేజ్‌కు పెట్టింది పేరు. ఇవి తక్కువ బరువును కలిగి ఉండి, మంచి హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తాయి. టీవీఎస్ ఫినిక్స్‌ను కూడా కంపెనీ ఇదే కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేసింది. దీని మొత్తం బరువు 114 కేజీలు మాత్రమే (డిస్క్ బ్రేక్ వెర్షన్ బరువు 116 కేజీలు). ఇది లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్. డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.49,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డిస్క్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.52,000 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. ప్రీమియం బైక్‌ల్లో ఉండే ఫీచర్లు, శక్తిమంతమైన ఈకోథ్రస్ట్ ఇంజన్‌తో టీవీఎస్ ఫినిక్స్‌ను రూపొందించారు. ఇందులో అమర్చిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

ఓవర్‌వ్యూ:

టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న ఫ్లేమ్ మోటార్‌సైకిల్ స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ఓ విడుదల చేసిన ప్రీమియం 125సీసీ మోటార్‌సైకిల్ టీవీఎస్ ఫినిక్స్. శక్తివంతమైన పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్, ఆకట్టుకునే డిజైన్ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

డ్యూయెల్ టోన్ గ్రాఫిక్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125 మోటార్‌సైకిల్ డ్యూయెల్ టోన్ (రెండు రంగల కలయిక) కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉండి చూపరలను ఇట్టే ఆకట్టుకుంటుంది. మొరాకన్ రెండ్, అలస్కా గ్రీన్, హెల్సిన్కీ బ్లాక్ సిల్వర్, బెల్జియన్ బ్లాక్ రెడ్, ఆక్స్‌ఫర్డ్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్:

హెడ్‌లైట్‍‌కు పైభాగంలో రెండు చివర్లలో అమర్చిన ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ బైక్‌కు మంచి స్టయిలిష్‌ లుక్‌నిస్తాయి. బైక్‌కు కళ్ల మాదిరిగా ఉండే ఈ లైట్లను పగలైనా రాత్రైనా ఆన్ చేసుకోవచ్చు.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

ఈకోథ్రస్ట్ ఇంజన్‌:

టీవీఎస్ ఫినిక్స్‌లో అమర్చిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

హాజర్డ్ లైట్స్:

కేవలం కార్లకు మాత్రమే పరిమితమైన హాజర్డ్ లైట్స్ ఇప్పుడు టీవీఎస్ ఫినిక్స్‌లో కూడా లభించనున్నాయి. బైక్‌ను రోడ్డుపై నిలిపినప్పుడు ఎదురుగా, వెనుకగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు ఈ హాజర్డ్ లైట్స్ ఉపయోగపడుతాయి. హాజర్డ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు బైట్ ఫ్రంట్, రియర్ ఇండికేటర్స్ వెలుగుతూ, ఆరుతూ ఉంటాయి.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

డిజిటల్ మీటర్:

ఈ సెగ్మెంట్లో కెల్లా పూర్తిగా డిజిటల్ మీటర్‌తో లభించే మోటార్‌సైకిల్ టీవీఎస్ ఫినిక్స్ మాత్రమే.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ డిస్క్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. డిస్క్ వద్దకునే వారు డ్రమ్ బ్రేక్ వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సమర్థవంతమైన బ్రేకింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

ధర:

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్. డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.49,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డిస్క్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.52,000 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

టీవీఎస్ ఫినిక్స్ 125 సమీక్ష

కాంపిటీషన్:

ఈ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లకు ధీటుగా టీవీఎస్ ఫినిక్స్ నిలువనుంది.


టీవీఎస్ ఫినిక్స్ ఐదు ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయిక) ఆప్షన్‌తో లభ్యమవుతుంది. మొరాకన్ రెండ్, అలస్కా గ్రీన్, హెల్సిన్కీ బ్లాక్ సిల్వర్, బెల్జియన్ బ్లాక్ రెడ్, ఆక్స్‌ఫర్డ్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి స్ఫూర్తి పొందిన డెకాల్స్ (బాడీ ప్యానెల్స్), రోటోపెటల్ డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్, ఆల్-బ్లాక్ ఇంజన్, అల్లాయ్ వీల్స్, స్టిచ్డ్ డ్యూయెల్ టెక్స్చర్, హై డెన్సిటీ కంఫర్ట్ కుషన్ సీట్ వంటి ఫీచర్లు టీవీఎస్ ఫినిక్స్ 125 సొంతం. ఈ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లకు ధీటుగా టీవీఎస్ ఫినిక్స్ నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 26, 2012, 10:53 [IST]
English summary
Read the TVS Phoenix 125 review here. The Phoenix 125 replaced the Flame in TVS's line-up and is the latest lates125cc motorcycle to hit the market. The TVS Phoenix is powered by the 125cc Ecothrust engine that can deliver a mileage of 67kmpl. The engine has digitally mapped ignition system that helps reduce emissions while also reducing fuel consumption.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+