దేశీయ విపణిలో టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ బైక్ విడుదల

By Ravi

చెన్నైకు చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల చెన్నై మార్కెట్లో విడుదల చేసిన 125సీసీ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ 'టీవీఎస్ ఫినిక్స్'ను తాజాగా దేశీయ మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గడచిన సెప్టెంబర్ నెలలో టీవీఎస్ ఫినిక్స్‌ను కంపెనీ తొలిసారిగా చెన్నై మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అనంతరం ఈ బైక్‌ను దశల వారీగా వివిధ రాష్ట్రాలలో కంపెనీ విడుదల చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా టీవీఎస్ తమ కొత్త బైక్‌ను న్యూఢిల్లీలో విడుదల చేసింది.

టీవీఎస్ ఫినిక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్. డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.49,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డిస్క్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.52,000 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. ప్రీమియం బైక్‌ల్లో ఉండే ఫీచర్లు, శక్తిమంతమైన ఈకోథ్రస్ట్ ఇంజిన్‌తో టీవీఎస్ ఫినిక్స్‌ను రూపొందించామని కంపెనీ పేర్కొంది. 125 సీసీ బైక్‌ సెగ్మెంట్లో ప్రతినెలా సుమారు 4 లక్షల వరకూ బైక్‌లు అమ్ముడుపోతున్నాయని, ఈ విభాగంలో తాము 5-7 శాతం వాటా సాధించాలనుకుంటున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) హెచ్‌ఎస్ గోయింది పేర్కొన్నారు.

టీవీఎస్ ఫినిక్స్ - ధర

టీవీఎస్ ఫినిక్స్ - ధర

టీవీఎస్ ఫినిక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్. డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.49,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డిస్క్ బ్రేక్స్ కలిగిన ఫినిక్స్ ధర రూ.52,000 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

టీవీఎస్ ఫినిక్స్ - మైలేజ్

టీవీఎస్ ఫినిక్స్ - మైలేజ్

టీవీఎస్ ఫినిక్స్‌లో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభించే ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది

టీవీఎస్ ఫినిక్స్‌ - కలర్స్

టీవీఎస్ ఫినిక్స్‌ - కలర్స్

టీవీఎస్ ఫినిక్స్ ఐదు ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయిక) ఆప్షన్‌తో లభ్యమవుతుంది. మొరాకన్ రెండ్, అలస్కా గ్రీన్, హెల్సిన్కీ బ్లాక్ సిల్వర్, బెల్జియన్ బ్లాక్ రెడ్, ఆక్స్‌ఫర్డ్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది.

టీవీఎస్ ఫినిక్స్‌ - ఫీచర్స్

టీవీఎస్ ఫినిక్స్‌ - ఫీచర్స్

ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి స్ఫూర్తి పొందిన డెకాల్స్ (బాడీ ప్యానెల్స్), రోటోపెటల్ డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్, ఆల్-బ్లాక్ ఇంజన్, అల్లాయ్ వీల్స్, స్టిచ్డ్ డ్యూయెల్ టెక్స్చర్, హై డెన్సిటీ కంఫర్ట్ కుషన్ సీట్ వంటి ఫీచర్లు టీవీఎస్ ఫినిక్స్ 125 సొంతం.

టీవీఎస్ ఫినిక్స్ - కాంపిటీషన్

టీవీఎస్ ఫినిక్స్ - కాంపిటీషన్

ఈ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లకు ధీటుగా టీవీఎస్ ఫినిక్స్ నిలువనుంది.


టీవీఎస్ ఫినిక్స్‌లో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభించే ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ ఫినిక్స్ ఐదు ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయిక) ఆప్షన్‌తో లభ్యమవుతుంది. మొరాకన్ రెండ్, అలస్కా గ్రీన్, హెల్సిన్కీ బ్లాక్ సిల్వర్, బెల్జియన్ బ్లాక్ రెడ్, ఆక్స్‌ఫర్డ్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది.

ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి స్ఫూర్తి పొందిన డెకాల్స్ (బాడీ ప్యానెల్స్), రోటోపెటల్ డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్, ఆల్-బ్లాక్ ఇంజన్, అల్లాయ్ వీల్స్, స్టిచ్డ్ డ్యూయెల్ టెక్స్చర్, హై డెన్సిటీ కంఫర్ట్ కుషన్ సీట్ వంటి ఫీచర్లు టీవీఎస్ ఫినిక్స్ 125 సొంతం. గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ మోటార్ కంపెనీ తొలిసారిగా ఫినిక్స్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఫినిక్స్ 125సీసీ సగ్మెంట్లో టీవీఎస్ అందిస్తున్న రెండవ ఉత్పత్తి కావటం విశేషం (మొదటి ఉత్పత్తి టీవీఎస్ ఫ్లేమ్). ఈ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లకు ధీటుగా టీవీఎస్ ఫినిక్స్ నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 4, 2012, 12:07 [IST]
English summary
TVS Motor Company launched its premium executive deluxe 125cc motorcycle, TVS Phoenix 125 in Delhi. Dubbed by the company to be one of the most exciting products to roll off its lines, TVS Phoenix 125 is targeted at consumers who aspire to upgrade from just commuting to those who crave for a spirited ride experience without compromising on mileage.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+